నయనతార గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా ఎంతో మంచి సక్సెస్ ని అందుకున్న వాళ్లలో నయన్ దంపతులు ఉంటారు. నయనతార విగ్నేష్ శివన్ సెలబ్రిటీ కపుల్ లిస్టులో ముందు ఉంటారు. దర్శకుడు విగ్నేష్ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండగా నయనతార సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ పేరు ప్రఖ్యాతలను తెచ్చుకుంటోంది. ఏడేళ్ల పాటు ఈ దంపతులు ప్రేమలో ఉండి గత రెండు సంవత్సరాల క్రితం పెళ్లితో ఒకటయ్యారు. కలిసి జీవితాన్ని పంచుకుంటున్నారు. ఈ దంపతులు సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకి జన్మనిచ్చారు.
ప్రస్తుతమైతే విగ్నేష్ శివన్, నయనతార ఇద్దరు కూడా వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. నయనతార వంటి స్టార్ హీరోయిన్ డైరెక్టర్ ప్రేమలో పడడం ఏంటని చాలామంది షాక్ అయిపోయారు. తాజాగా ఇంటర్వ్యూలో విగ్నేష్ నయనతార తో తన ప్రేమ ఎలా మొదలైంది ఇద్దరు ఒకటవ్వడానికి కారణం ఏంటి అనే విషయాన్ని చెప్పారు. ఇద్దరూ ఒకటవ్వడానికి స్టార్ హీరో ధనుష్ కారణమని తెలుస్తోంది. విగ్నేష్ దర్శకుడిగా చేస్తున్న సినిమా కి హీరోయిన్ గా నయన్ ని ధనుష్ సూచించారు.
కథ తనకి నచ్చింది అప్పటివరకు ఈ మూవీలో నటించినని అన్న విజయ్ సేతుపతి నయనతార ఓకే చెప్పారని తెలిసి వెంటనే సినిమాకి ఒప్పుకున్నారని. విగ్నేష్ ఈ మూవీ మూవీ వలన నయన్ తో ఎక్కువ సమయం ని కేటాయించాను అయితే మాకు తెలియకుండా ప్రేమలో పడిపోయాం. ఒకరకంగా మా ప్రేమకి ధనుష్ కారణమని విగ్నేష్ చెప్పారు. ధనుష్ ఇలా వీళ్ళ ప్రేమకి కారణం అని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఇప్పటివరకు ఈ విషయాన్ని ఎవరూ రివిల్ చేయలేదు. ఇప్పుడు నయనతార విగ్నేష్ ప్రేమకి కారణం ధనుష్ అని తెలియగానే అంతా ఆశ్చర్యపోతున్నారు.