టాలీవుడ్ స్టార్ సింగర్ల రెమ్యూనరేషన్ చూశారంటే షాక్ అవుతారు. కొన్నేళ్ల క్రితం దాకా టాలీవుడ్ స్టార్ సింగర్ రెమ్యూనరేషన్ తక్కువగా ఉండేది. ఇప్పుడు మాత్రం బాగా పెరిగింది కొంతమంది సింగర్లు ఇంటర్వ్యూలో 3 వేల రూపాయలను 5000 రూపాయలకి పాటలు పాడామని ఓపెన్ గా చెప్తూ ఉంటారు. అయితే కాలం నుండి మార్పులు కూడా చాలా వస్తూ ఉంటాయి కాలంతో పాటుగా సినిమాల బడ్జెట్ లు పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు సింగర్ ల పారితోషకాలు సైతం భారీగా పెరిగాయి. క్రేజ్ ఉన్న సింగర్లను ఎంచుకుంటే సినిమాలకి బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతూ ఉంటుంది. సిద్ శ్రీరామ్ పాటలకి 5 లక్షల నుండి ఎనిమిది లక్షల దాకా పారితోషకం తీసుకుంటారు.
సిద్ పాటలు అన్నీ హిట్ అవడంతో భారీగా పారితోషకం ని అందిస్తున్నారట. శ్రేయ ఘోషల్ గురించి కూడా చెప్పుకోవాలి. దశాబ్దాల నుండి విజయవంతంగా శ్రేయ ఘోషల్ కెరీర్ ని కొనసాగిస్తున్నారు. ఆమె నాలుగు నుండి ఏడు లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటారు. సింగర్ రామ్ మిరియాల రెండు లక్షల వరకు తీసుకుంటారని తెలుస్తోంది.
అనురాజ్ కులకర్ణి కూడా ఈ రేంజ్ లోనే రెమ్యూనరేషన్ తీసుకుంటారు. మంగ్లీ ఎస్పీ చరణ్ లక్షన్నర నుండి 3 లక్షల వరకు తీసుకుంటారు గీతామాధురి లక్ష కంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకుంటుందని తెలుస్తోంది. ఇలా కొంతమంది సింగర్స్ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. భారీ రెమ్యునరేషన్ ఇచ్చిన కూడా ట్యూన్ లిరిక్స్ నచ్చితే మాత్రమే సాంగ్ పాడడానికి సింగర్స్ ఒప్పుకుంటారని కూడా తెలుస్తోంది.