Actress Anjali : హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు హీరోయిన్గా ప్రధాన పాత్రలు పోషిస్తూనే మరోవైపు ఇతర సినిమాల్లో కీలక పాత్రల్లోనూ నటిస్తోంది. అయితే 37 ఏళ్ల వయసు వచ్చినా ఈమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. చాలా సార్లు ఈమె పెళ్లి వార్తలు తెరపైకి వచ్చేవి. కానీ వాటిని ఆమె కొట్టిపారేస్తూ వచ్చేది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన పెళ్లిపై స్పందించింది. బడా నిర్మాతతో తన పెళ్లి అంటూ చెప్పుకొచ్చింది. పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం.. తెలుగమ్మాయి నటి అంజలి తెలుగు చిత్ర సీమప్రేక్షకులకు బాగానే పరిచయం. నాకు అన్నీ అలా తెలిసిపోతాయ్ అంతే అంటూ ఎంతో మంది అభిమానుల్లో చోటు సంపాదించుకుంది.
మొదట షాపింగ్ మాల్ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. తెలుగులో వచ్చేసరికి 2006లో ఫోటో అనే సినిమాతో ఇక్కడి ప్రేక్షకులను పరిచయం చేసుకుంది. అనంతరం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మాత్రం మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అలా వచ్చిన గుర్తింపుతో మసాలా సహా పలు చిత్రాల్లో నటించింది. కానీ ఇక్కడ స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయింది. ఇక ఈమె పర్సనల్ విషయానికొస్తే 37 ఏళ్ల వయసు వచ్చినా ఈమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. చాలా సార్లు ఈమె పెళ్లి వార్తలు తెరపైకి వచ్చేవి. అయితే ఆ మధ్య ఈమె ఓ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకుని ఫారెన్‌లో సెటిల్ అయ్యిందంటూ వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత ఓ తెలుగు నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం సాగింది. పెళ్లై విడాకులు తీసుకున్న నిర్మాతతో ఆమె ఏడడగులు వేయబోతున్నట్లు అన్నారు. తాజాగా వీటిపై స్పందిస్తూ..‘నాకు తెలియకుండానే ఇప్పటికి నాలుగుసార్లు పెళ్లి చేశారు. ఇప్పుడు ఐదోసారి చేస్తున్నారు. నేను కూడా సోషల్ మీడియాలో దీని గురించి విన్నాను. నేను పెళ్లి చేసుకుని వేరే ఇంట్లో ఉంటున్నట్లు రాశారు. వాళ్లకు తెలియని విషమేమిటంటే నేను అవుట్ డోర్ షూటింగ్స్‌లోనే ఎక్కువగా ఉంటున్నా. ఆ వార్తకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అది ఫేక్ న్యూస్. పెళ్లైతే చేసుకుంటా.. కానీ ఇప్పుడు కాదు. దానికి కొంచెం టైమ్ ఉంది’ అని చెప్పుకొచ్చింది.