Allu arjun: “తగ్గేదే లే” అనే డైలాగ్ తో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ సృష్టించిన మానియాను ఇప్పట్లో ఎవరు మర్చిపోలేరు. పుష్పకు కొనసాగింపుగా వస్తున్న పుష్ప-2 కోసం దేశం మొత్తం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ మూవీ టీజర్ కు సంబంధించిన రిలీజ్ డేట్ ను మూవీ టీం ప్రకటించింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా టీజర్ ను విడుదల చెయ్యనున్నారు. ఇంతకుముందే విడుదల అయిన పుష్ప-2 పోస్టర్ ను ఇంటర్నెట్ ను షాక్ చేసింది. కాబట్టి ఇప్పుడు వచ్చే టీజర్ ఇంకెంత వైరల్ అవుతుందో చూడాలి.

అయితే ఈ టీజర్ లో ఎవరెవరి క్యారెక్టర్స్ ఉంటాయో, ఎన్ని కొత్త క్యారెక్టర్స్ ఉంటాయో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. అలాగే భన్వర్ సింగ్ షెకావత్ కు పుష్ప కు మధ్యన ఉన్న గొడవలకు సంబంధించిన లీక్స్ ఏమైన టీజర్ లో ఉంటాయో చూడాలి. అలాగే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఎలా ఉంటుందని సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కేశవ క్యారెక్టర్ పై ఇంటర్నెట్ లో చాల ఫ్యాన్ థియరీలు నడుస్తున్నాయి. ఇంకా పుష్ప-2 కేశవకు ఇంకెంతకీ రోల్ ఉందొ చూడాలి.
ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ సుకుమార్ గురించి. పుష్ప -2 స్క్రిప్ట్ కోసం చాల రోజుల స్క్రిప్ట్ పై వర్క్ చేశారు. లాజిక్స్ తో మ్యాజిక్ చేసే సుకుమార్, ఇప్పుడు ఇంత కేజ్రీ ప్రాజెక్ట్ లో ఇంకెంత కేజ్రీ రైటింగ్ ఉంటుందో చూడాలి. అలాగే జాతర ఫైట్, సాంగ్స్ గురించి ఇంటర్నెట్ లో చాల గొప్పగా ఫ్యాన్స్ చెప్తున్నారు. ఆ జాతరకు సంబంధించిన షాట్స్ ఎమన్నా ఉంటాయో చూడాలి.