Lavanya tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించినా స్టార్ హీరోయిన్ రేంజ్ అందులో లేకపోయింది. అయినా అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం ఈ మెగా కోడలు ఓ క్రేజీ ప్రాజెక్ట్ కు సైన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పెళ్లి తర్వాత ఆమె నటించిన ఒకే ఒక్క వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్ . ఈ సిరీస్ లో చాలా పర్ఫెక్ట్ గా కనిపించింది. మెగా ఇంటి పరువును ఎక్కడా తీయకుండా చాలా పద్ధతిగా కనిపించింది. అయితే సినిమాల్లో ఎప్పుడూ అలా పద్ధతిగా కనిపించాలంటే అది కుదరని పని.
అక్కడో ఇక్కడో ఎక్కడో సినిమా కథనుసారం ఒకచోట హద్దులు మీరాల్సిందే. అయితే లావణ్య త్రిపాఠి మాత్రం అలాంటి సీన్స్ ఉన్న సినిమాలను ఖరాఖండిగా రిజెక్ట్ చేసేస్తుందట. ఇటీవల మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకు ఓకే చెప్పిందట. ఈ సినిమాలో అమ్మడు ఓ పాపకి తల్లిగా కనిపించబోతుందట. కుటుంబ బాధ్యతల కోసం కష్టపడే మహిళగా ఈ సినిమాలో చూపించబోతున్నారట .
మందు అలవాటు ఒక ఫ్యామిలీని ఎలా రోడ్డు మీద పడేస్తుందో అన్న కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కబోతుందట . ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి భర్తలేని వైఫ్ గా నటించబోతుందట. ఒక తాగుబోతు భర్త నిర్లక్ష్యంగా తన కుటుంబ బాధ్యతలను పట్టించుకోకుండా పోతే బాధ్యత కల భార్య పిల్లల కోసం ఏం చేస్తుంది? ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది..? ఆమెను సమాజం ఎలా చూస్తుంది? అనే విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నారట. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాతో లావణ్య మంచి హిట్ అందుకుంటుంది అంటున్నారు ఆమె ఫ్యాన్స్.