Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి భర్త బోనీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో పేర్గాంచిన ఫిల్మ్ మేకర్. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. తన ముద్దుల కూతురు, బ్యూటీఫుల్ జాన్వీ కపూర్ కి సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని పబ్లిక్ గా బయటపెట్టేసాడు బోనీ కపూర్. మనకు తెలిసిందే బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో చేసిన రాని గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రాగానే సంపాదించుకుంది తెల్ల తోలు పిల్ల జాన్వీ కపూర్.
ఈ అందాల ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పెహరియాతో పబ్లిక్ గానే చెట్టా పట్టాలేసుకొని తిరిగేస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ తండ్రి బోనీకపూర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శిఖర్ లాంటి అబ్బాయి తమ జీవితాల్లో ఉండడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పాడు. జాన్వీ గతంలో తనకు దూరంగా ఉంది అని.. అప్పుడు అర్జున్ కపూర్ మాత్రం శిఖర్ తో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యామని చెప్పుకొచ్చాడు.
ఆయనను ఎక్స్ చేయొద్దు అంటూ కూతురుకి పదేపదే సూచించాడట. మొత్తానికి జాన్వీ -శిఖర్ మళ్లీ కలవడానికి కారణం బోనీకపూర్ అని అర్థం అయిపోయింది. కాబోయే అల్లుడు గురించి ఓ రేంజ్ లో పొగిడేశాడు బోనీకపూర్. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. జాన్వీ కపూర్.. దేవర సినిమాతో పాటు రామ్ చరణ్ – బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలోను హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.