పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ లో నటిస్తుండగా సందీప్ రెడ్డి వంగాతో ఓ మూవీకి కమిట్ అయిన విషయం తెలిసిందే. ‘స్పిరిట్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు.
ప్రస్తుతం టాలీవుడ్ సమాచారం ప్రకారం.. సందీప్ రెడ్డి హీరోయిన్ పాత్ర కోసం ముగ్గురు పేర్లను పరిశీలిస్తున్నట్లు టాక్. రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, కీర్తి సురేష్ పేర్లను పరిశీలిస్తున్నారని, వీరిలో ఒకరిని త్వరలోనే ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. అయితే ప్రభాస్, హను రాఘవపూడి సినిమా కోసం మృణాల్ ను పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఈ పాత్రకు రష్మిక లేదా కీర్తి సురేష్ లలో ఒకరిని సందీప్ వంగా ఫైనల్ చేసే అవకాశం ఉంది. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
ఈ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి సందీప్ ను సెన్సేషనల్ డైరెక్టర్ గా నిలబెట్టింది. ప్రభాస్ హీరోగా ఓ కాప్ డ్రామాగా ‘స్పిరిట్’ అనే సినిమా చేయబోతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ముగ్గురు హీరోయిన్లను పరిశీలిస్తున్నప్పటికీ ఇంకా ఎవరు అనేది ఫైనల్ కాలేదు. ఒకవేళ కీర్తి ఈ ప్రాజెక్టును చేజిక్కించుకుంటే అది ఆమె కెరీర్ కు పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది. ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ షూటింగ్ లో ఉన్న ప్రభాస్ ఏప్రిల్ లో రాజా సాబ్ కు డేట్స్ కేటాయించాడు.