Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో అమ్మడు ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. గతేడాది అనిమల్ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో ట్రెండ్ మార్క్ సృష్టించింది రష్మిక. . సోషల్ మీడియాలో రష్మిక ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రష్మిక చేతిలో మొత్తం ఐదు సినిమాలు ఉన్నాయి. వీటిలో మూడు ప్రధాన ప్రాజెక్ట్‌లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రష్మిక భావిస్తోంది.
అందులో ఒకటి అల్లు అర్జున్ ‘పుష్ప 2’ కాగా రెండోది ధనుష్-శేఖర్ కమ్ముల సినిమా. ఇక మరొకటి బాలీవుడ్ చిత్రం ‘చావా’ కూడా లైన్లో ఉంది. ఇక పుష్ప 2 ఈ ఏడాది ఆగస్ట్ 15న ఈ చిత్రం విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇవన్నీ పక్కన పెడితే రష్మిక ఫ్యాన్స్ ఎదుచూస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ నుంచి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. “అందాల రాక్షశి & చి ల సౌ” ఫేమ్ రాహుల్ రవీంద్రన్ రచన డైరెక్ట్ చేస్తున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ మరోసారి తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకి సమాధానమిస్తూ ఏప్రిల్ 5న రష్మిక పుట్టినరోజు సందర్భంగా సినిమా టీజర్‌ను రిలీజ్ చేస్తామని రాహుల్ రవీంద్రన్ చెప్పారు.
ఇక ఈ మూవీని ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నాం అని ఐదు భాషల్లో రష్మిక మందన్న స్వయంగా డబ్బింగ్ చెప్పుతుంది అని చెప్పుకొచ్చారు. మలయాళ సంగీత సంచలనం హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూర్చగా, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై విద్యా కొప్పినీడి మరియు ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు.