Snigdha : ఐదో తరగతిలోనే నాపై రేప్ అటెంప్ట్ జరిగింది.. నటి సంచలన నిజాలు

- Advertisement -

Snigdha : నాని హీరోగా, నిత్యామీనన్ హీరోయిన్ గా నటించిన అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది స్టార్ బ్యూటీ స్నిగ్ధ. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పింకీ పాత్రలో మగరాయుడు గెటప్‌లో నటించి మెప్పించింది. నాని, నిత్యామీనన్‌లకు స్నేహితురాలిగా నటించిన ఈ క్యూట్ గర్ల్ ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఎప్పుడూ ప్యాంటు, షర్ట్, క్రాప్ వేసుకుని కుర్రాడి గెటప్‌లో కనిపించే స్నిగ్ధ.. నిజ జీవితంలో దాదాపు అదే మగ రాయుడిలా కనిపించడానికి ఇష్టపడుతుంది.

స్నిగ్ధ ఇప్పటి వరకు మేం వయసుకు వచ్చాం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, రొటీన్ లవ్ స్టోరీ, దమ్ము వంటి ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. తాజాగా స్నిగ్ధ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది. ఇందులో భాగంగా తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. రీతూ చౌదరి హోస్ట్ చేస్తున్న దావత్ షో ద్వారా సెలబ్రిటీలకు సంబంధించిన అనేక రహస్యాలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. తాజాగా ఈ షోకి హాజరై సందడి చేసింది స్నిగ్ధ. ఇందులో భాగంగా తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాన్ని వివరించింది. మా అమ్మ చనిపోయినప్పుడు నేను చూడలేకపోయాను.

- Advertisement -

చాలా ఏళ్లుగా ఈ పరిస్థితి నన్ను ఇబ్బంది పెట్టిందని వివరించింది. తాను ఐదో తరగతి చదువుతున్నప్పుడు ఇందిరాపార్కుకు వెళ్లానని… అక్కడ ఆడుకుంటున్న సమయంలో ఎవరో వచ్చి పొదల్లోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించారని తెలిపింది. అది రేప్ అటెంప్ట్ అని చెప్పాలి.. ఇప్పటికీ ఆ సంఘటన మరిచిపోలేకపోతున్నాను.. దాన్నుంచి బయటపడేందుకు దాదాపు పదేళ్లు పట్టింది. నైట్ బెడ్‌పై నాన్న, మామ ఎక్కడ పడుకున్నారో అక్కడ పడుకోవాలంటే భయంగా ఉందని స్నిగ్ధ వివరించింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here