Kriti Kharbanda : అన్నీ రివర్స్.. పెళ్లి అయిపోయిన తర్వాత అది చేసుకున్న స్టార్ హీరోయిన్

- Advertisement -

Kriti Kharbanda : టాలీవుడ్ క్యూట్ బ్యూటీ కృతి కర్బందా గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ ఏడాది పెళ్లి చేసుకున్న వారిలో ఆమె కూడా ఒకరు. అప్పటికే పెళ్లై విడాకులు తీసుకున్న వ్యక్తిని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. మార్చి 15న పెళ్లి చేసుకున్న ఈ జంట తాజాగా హల్దీ వేడుకను జరుపుకున్నారు. ఈ గ్రాండ్ సెలబ్రేషన్స్‌లో కృతి తన బాయ్‌ఫ్రెండ్ పుల్కిత్ సామ్రాట్‌తో కలిసి చాలా అందంగా కనిపించింది. అయితే పెళ్లిలో తమ అందాన్ని రెట్టింపు చేసేందుకు.. హల్దీ వేడుకల్లో పసుపుకు బదులు వేరే దానిని పూసుకోవడంతో వచ్చిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు.

 

- Advertisement -

కృతి ఖర్బందా అక్కినేని హీరో సుమంత్ బోణి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన తీన్ మార్, రామ్ పోతినేనితో ఒంగోలు గిత్త, మంచు మనోజ్ మిస్టర్ నూకయ్య వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా 2015లో వచ్చి ‘బ్రూస్‌లీ’ సినిమాలో రామ్ చరణ్ అక్కగా నటించింది. దీంతో అమ్మడి క్రేజ్ ఒక్క సారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత ఈ అమ్మడు బాలీవుడ్ చెక్కేసి పలు చిత్రాల్లో నటించింది. ఆశించిన స్థాయి స్టార్ డమ్ రాకపోవడంతో ఆఫర్లు తగ్గి ఇండస్ట్రీకి దూరమై పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ పెట్టింది. అయితే కృతి కొద్ది కాలంగా నటుడు పుల్కిత్ సామ్రాట్‌లో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

 

పెద్దలను ఒప్పించి మార్చి 15న గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. సినీ సెలబ్రిటీలు ఫ్యాన్స్ కృతి ఖర్బందకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే.. తాజాగా, కృతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన హల్దీ వేడుకకు సంబంధించిన పిక్స్ షేర్ చేసింది. అయితే సాధారణంగా అందరూ పెళ్లికి ముందు ఈ వేడుకను నిర్వహించుకుంటారు. కానీ కృతి మాత్రం వివాహం అయ్యాక చేసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా అందరూ నలుగు, పసుపుతో చేసుకుంటే ఆమె మాత్రం వెరైటీగా ముల్తానీ మట్టితో చేసుకుని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక వాటిని చూసిన వారంతా హార్ట్ ఎమోజీలను షేర్ చేసి కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here