Varun Sandesh : పిల్లలు ఎప్పుడు కంటారు అన్నందుకు.. ఈ పిల్లాడు పెద్దకానివ్వండి అన్న హీరోయిన్ వితికా

- Advertisement -

Varun Sandesh : టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్-వితిక షేరు జంటగా నటించిన చిత్రం ‘పడ్డానండి ప్రేమలో మరి’. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి 2016లో పెళ్లి చేసుకున్నారు.అప్పటి నుంచి వితిక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ వరుణ్ మాత్రం పలు సినిమాల్లో నటిస్తూ తన క్రేజ్ రోజు రోజుకు పెంచుకుంటున్నాడు. అయితే ఈ క్యూట్ కపుల్ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-3 షోలో కంటెస్టెంట్స్‌ గా హౌసులోకి అడుగు పెట్టారు. ఈ ఇద్దరూ ఆ షోలో పలు టాస్క్ ల్లో చురుకుగా పాల్గొన్నప్పటికీ చివరి వరకు నిలువలేకపోయారు. ఈ నేపథ్యంలోనే వితికా బిగ్‌బాస్ ఇంట్లో ఉన్న తీరుపై నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేశారు. దీంతో ఆమె కొంత కాలం డిప్రెషన్‌కు వెళ్లిపోయింది. వరుణ్ ఆమె వెన్నంటే ఉండి మళ్లీ వితికా నార్మల్ అయ్యేలా చేశాడు.

దీనితో వితికా షేరు ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో తనకు సంబంధించిన విషయాలతో పాటు పలు ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ చేస్తూ నిత్యం ఏదో ఒక వీడియో షేర్ చేస్తూనే ఉన్నారు. ఇక వరుణ్ విషయానికొస్తే హీరోగా పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. వితికా షెరును జనాలు పెళ్లై ఎనిమిదేళ్లు అవుతుంది.. పిల్లలను ఎప్పుడు కంటారు? పిల్లలను కనాలనే ఆలోచన ఏమైనా ఉందా లేదా? అని నిత్యం ప్రశ్నిస్తూనే ఉన్నారు.

- Advertisement -

దీంతో విసిగిపోయిన వితిక తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ షాకింగ్ వీడియోను షేర్ చేసింది. పిల్లలు ఎప్పుడు కంటారని ప్రజలు నన్ను పదే పదే అడుగుతున్నారు.. ఇదే నా స్పందన.. ఈ పిల్లవాడు పెద్దయ్యాక చూస్తాను’’ అని చెప్పింది. ఇందులో భార్యాభర్తలు కలిసి కారులో ఎక్కడికో వెళ్తున్నారు.. వరుణ్-వితిక ఒడిలో పడుకున్నారు. తన భర్త తన బిడ్డ అని, అతను పెద్దయ్యాక బిడ్డకు జన్మనిస్తానని సమాధానమిచ్చింది. ఈ పోస్ట్ చూసిన వారంతా వితిక సూపర్ ఆన్సర్ ఇచ్చారని కొనియాడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Vithika Sheru (@vithikasheru)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here