Sonu Srinivas Gowda : ప్రముఖ బిగ్‌బాస్ నటి అరెస్ట్.. ఎందుకంటే..?

- Advertisement -

Sonu Srinivas Gowda : కన్నడ బిగ్ బాస్ OTT కంటెస్టెంట్ సోను శ్రీనివాస్ గౌడను బెంగళూరు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా 8 ఏళ్ల చిన్నారిని అక్రమంగా దత్తత తీసుకోవడమే ఆమె అరెస్టుకు కారణమని తెలుస్తోంది. పిల్లలను దత్తత తీసుకునే నిబంధనలను ఆమె ఉల్లంఘించిందని పోలీసులు తెలిపారు. సోను శ్రీనివాస్‌గౌడ్‌పై కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

పిల్లలను దత్తత తీసుకోవడంలో అనేక ప్రక్రియలు ఉన్నాయి. అలాంటి రూల్స్ పాటించకుండానే సోను శ్రీనివాస్ గౌడ్ దత్తత తీసుకున్నట్లు తెలుస్తోంది. దత్తత తీసుకున్న వ్యక్తి మరియు బిడ్డ మధ్య కనీసం 25 సంవత్సరాల వయస్సు వ్యత్సాసం ఉండాలి. అయితే సోనూ శ్రీనివాస్ గౌడ్ కు.. ఆ అమ్మాయి వయసు తేడా అంతగా లేదనే విషయం బయటకు వచ్చింది.

Sonu Srinivas Gowda
Sonu Srinivas Gowda

అలాగే దత్తత తీసుకున్న పిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయకూడదు. కానీ సోనూ అలాంటి రూల్స్ పాటించలేదు. అంతేకాదు తల్లిదండ్రులకు ఎన్నో సౌకర్యాలు కల్పించి పాపను అక్రమంగా దత్తత తీసుకుందంటూ సోను శ్రీనివాస్ గౌడ్ పై ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సోను శ్రీనివాస్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై సోను శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తనకు తెలిసినంత వరకు దత్తత నిబంధనలు పాటించానన్నారు. చిన్నారి తల్లిదండ్రులను సంప్రదించిన తర్వాతే దత్తత కార్యక్రమం చేపట్టామన్నారు. బిడ్డను చట్టబద్ధంగా దత్తత తీసుకోవడానికి కనీసం 3 నెలలు పడుతుంది. తల్లిదండ్రులు అంగీకరించిన తర్వాతే పాపను దత్తత తీసుకున్నట్లు తెలిపింది. చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని, ఈ కేసులో ఆమె నిర్దోషిగా బయటపడుతుందని సోనూ తెలిపింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here