Sruthi Hasan : కోలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు లోకేష్ కనగరాజ్. ప్రస్తుతం తను తొలిసారిగా నటించబోతున్న ఆన్-స్క్రీన్ డెబ్యూ ‘ ఇనిమెల్ సాంగ్’ ప్రోమో వీడియో విడుదలైంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద విశ్వనటుడు కమల్ హాసన్ నిర్మించగా ఈ పాటకు ఆయన కుమార్తె, హీరోయిన్ శృతి హాసన్ మ్యూజిక్ అందించారు. ఈ ప్రోమోలో చూస్తే శృతి-లోకేష్ కనగరాజ్ ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది. ప్రేమికుల మధ్య జరిగే ఇనిమెల్ సాంగ్ ప్రోమో ఇప్పుడు బయటకు వచ్చి నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. ఇప్పటి వరకు కేవలం దర్శకత్వం పైనే దృష్టి పెట్టిన లోకేష్ కనరాజ్ ఈ ఆల్బమ్ సాంగ్‌లో తొలిసారి శృతి హాసన్‌కి జోడీగా నటించాడు. ఈ పాటలో లోకేష్ నటించాడు అనడం కంటే జీవించాడు అని అనొచ్చు.
అంతలా వీరిద్దరి కెమిస్ట్రీ పండింది. ఇక ఈ ఆల్బమ్ సాంగ్ మార్చి 25న ఆన్‌లైన్‌లో రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా పాట టీజర్‌ను నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేశారు. ఈ టీజర్ చూసిన అభిమానులు సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే తన సినిమాలో కూడా రొమాన్స్ సీన్స్ ఎక్కవగా పెట్టని లోకేష్ ఈ ఆల్బమ్ సాంగ్ లో శృతితో శృతిమించి రొమాన్స్ చేసేశాడు. దీంతో ఇప్పుడు ఫుల్ ఆల్బమ్ సాంగ్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కమల్ కూతురు శ్రుతి హాసన్ పాన్ ఇండియా లెవల్లో తమిళం, తెలుగు, హిందీ భాషా చిత్రాల్లో నటిస్తోంది. ఆమె చివరిగా ప్రభాస్ నటించిన సలార్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.
శృతి హాసన్ నటి మాత్రమే కాదు, గాయని అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా. ఈ సందర్భంలో కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మించిన ఆల్బమ్ సాంగ్ ఇనిమెల్‌కు శృతి హాసన్ తనే స్వయంగా సంగీతం అందించారు. ఇక మరోపక్క లోకేష్ కనగరాజ్ ఇప్పటికే మాస్టర్, సింగపూర్ సలోన్ వంటి చిత్రాల్లో అతిథి పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఆల్బమ్ లిరిక్స్ ను నటుడు కమల్ హాసన్ రాశారని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు టీజర్ ను విడుదల చేసి ఈ ఆల్బమ్ సాంగ్ ను మార్చి 25న విడుదల చేయనున్నట్టు కూడా ప్రకటించారు.
#Inimel the game begins from 25th March.
Mark the Moment!
Streaming exclusively on https://t.co/UXpv3RSFt6#Ulaganayagan #KamalHaasan #InimelIdhuvey #Inimelat25th@ikamalhaasan @Dir_Lokesh @shrutihaasan #Mahendran @RKFI @turmericmediaTM @IamDwarkesh @bhuvangowda84 @philoedit… pic.twitter.com/LCAju1D2eq— Raaj Kamal Films International (@RKFI) March 21, 2024