ఏం డెడికేషన్ బాస్.. ఆ సినిమా కోసం ఏకంగా ప్రాణాన్నే పణంగా పెట్టిన సలార్ యాక్టర్

- Advertisement -

Prithviraj Sukumaran : మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తెలుసు కదా. అదేనండి సలార్ మూవీలో వరదరాజ మన్నార్ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు కదా తను. కథ, అందులోని పాత్ర కోసం తమని తాము మార్చుకునే అతికొద్ది మందిలో పృథ్వీరాజ్ ముందుంటాడు. ఆయన కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆడు జీవితం: ది గోట్‌ లైఫ్‌’ అనేది ట్యాగ్ లైన్. బ్లెస్సీ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీ మార్చి 28న మలయాళంతో పాటు తెలుగులోనూ రాబోతోంది. ఈ సందర్భంగా షూటింగ్‌ విశేషాలతో పాటు, ఆ పాత్ర కోసం తాను పడిన కష్టాన్ని పృథ్వీరాజ్ ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు.

Prithviraj Sukumaran
Prithviraj Sukumaran

ఈ సినిమాలో పృథ్వీ ఎడారిలో దారి తప్పిపోయి ఆకలితో అలమటించే వ్యక్తిగా కనిపించనున్నాడట. అయితే అందుకోసం తాను కూడా భోజనం మానేయాలనుకున్నాడట. ఆహారాన్ని కోసం రోజుల పాటు వేచి చూసిన వ్యక్తి ఎలా కనిపిస్తాడో అలాగే కనపడాలని ఎక్కువ సమయం ఉపవాసం ఉండేవాడట. కొన్నిసార్లు 72 గంటల పాటు కేవలం మంచినీళ్లు, కొద్దిగా బ్లాక్‌ కాఫీ మాత్రమే తాగేవాడట. శారీరకంగా ఈ మార్పు రావాలంటే కేవలం ఆహారం మానేస్తే సరిపోదని చెప్పిన పృథ్వీరాజ్.. మానసికంగానూ అందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు.

మనిషి శరీరం రెండు, మూడు రోజులు పాటు ఆహారం తీసుకోకపోయినా నిలబడుతుంది కానీ, రెండో రోజు నుంచే ఏదైనా తినమంటూ మన మెదడు చెబుతూ ఉంటుందని పృథ్వీ చెప్పాడు. ఇది అసలైన ఛాలెంజ్‌ అని, తనకు సాధ్యమైనంత వరకూ బరువు తగ్గేందుకు ప్రయత్నించానని తెలిపాడు. ఈ సినిమా కోసం ఏకంగా 31 కేజీలు తగ్గిపోయా’డట. ఏం డెడికేషన్ కదా.

- Advertisement -

Prithviraj Sukumaran

ఈ సినిమాలో పృథ్వీరాజ్‌ నజీబ్‌ అనే యువకుడిగా కనిపించనున్నాడు. కేరళ నుంచి పని కోసం మధ్య ప్రాశ్చ్యానికి వెళ్లిన ఓ యువకుడు బానిసగా ఎలా మారాడు? అక్కడి నుంచి తప్పించుకుని ఎలా బయటపడ్డాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్న అంశాలను ఇందులో చూపించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు పదేళ్ల పాటు ఈ మూవీ షూటింగ్‌ జరుపుకోవడం విశేషం.

మరోవైపు తన నెక్స్ట్ మూవీ గురించి కూడా పృథ్వీరాజ్ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. తాను తదుపరి లూసీఫర్-2లో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. తనకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్​ యూకేలో పూర్తైందని, 0శాతం మూవీ షూటింగ్‌ అయిపోయిందని, ఇంకొన్ని సీన్స్‌ యూఎస్‌లో తీయాలని చెప్పాడు. ఈ సినిమాలో మోహన్‌లాల్‌ థానాయకుడిగా నటిస్తున్నాడు. ‘ఎల్‌2: ఎంపురాన్‌’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ‘లూసిఫర్‌’కు సీక్వెల్‌గా ఇది రాబోతోంది. రాజకీయాల్లోకి రాకముందు స్టీఫెన్‌ గట్టుపల్లి (మోహన్‌లాల్‌) ఏం చేసేవాడు? ఖురేషి అబ్రహంగా ప్రపంచ మాఫియాను ఎలా శాసించాడు? అన్న విషయాలను ఇందులో చూపించనున్నారట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here