Kiara Advani .. ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే, పాన్ ఇండియా స్టార్ రామ్‌చరణ్‌తో వినయ విధేయ రామ, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో భరత్ అనే నేను సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ భామ అందం, అభినయానికి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఇక బాలీవుడ్లో ఈ బ్యూటీ వరుస సినిమాలు చేస్తూ సూపర్ హిట్లు ఇస్తూ బాక్సాఫీస్ క్వీన్‌గా మారిపోయింది. ఈ మధ్య ఈ భామ ఏ సినిమా చేసినా సూపర్ హిట్ అవుతోంది. ఇక సోషల్ మీడియాలో ఈ భామ రచ్చ మామూలుగా ఉండదు.

కియారా బీ టౌన్లో ఓ స్టైల్ ఐకాన్. తనకు సరిపడే ఔట్‌ఫిట్స్‌ను సెలెక్ట్ చేసుకోవడంలో, వాటిని కాన్ఫిడెంట్‌గా ధరించడంలో కియారాను మించిన బ్యూటీ లేదు. ఈ భామ ఏ ఔట్ఫిట్లోనైనా సరే తనను తాను క్యారీ చేసుకునే విధానానికి టీనేజ్ అమ్మాయిలు ఫిదా అవుతుంటారు. ఇక తాజాగా కియారా స్కై బ్లూ కలర్ కటౌట్ ఫ్రాక్‌లో మెరిసింది. ఈ భామ ముంబయిలో నిర్వహించిన పింక్ విల్లా స్క్రీన్ అండ్ స్టైల్ ఐకాన్ -2024 అవార్డ్స్ కార్యక్రమానికి ఈ ఔట్ఫిట్లో అటెండ్ అయింది.
ఈ ఔట్ఫిట్లో కియారాను చూసి ఫ్యాన్స్‌తో పాటు తోటి నటులు కూడా ఫిదా అయ్యారు. ఈ అట్టైర్లో ఈ భామ సూపర్ స్టైలిష్‌గా కనిపించింది. ఆ ఫొటోలు కాస్త తన సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టాలో పంచుకుంది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు మెస్మరైజ్ అవుతున్నారు. బ్లూ డ్రెస్‌లో కియారా ఐస్ క్వీన్‌లా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక కుర్రాళ్లైతే కియారా అందానికి మతి పోగొట్టుకుంటున్నారు. సూపర్ హాట్ కీ.. అంటూ తమ ప్రేమనంతా కామెంట్ బాక్సుల్లో హార్ట్ అండ్ ఫైర్ ఎమోజీల రూపంలో కురిపించేస్తున్నారు.
ఇక కియారా సినిమాల సంగతికి వస్తే ఈ భామ సత్య ప్రేమ్ కీ కథా, భూల్ భులయ్యా 2, గోవిందా నామ్ తేరా, జుగ్ జుగ్ జియో సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. ఇక తాజాగా ఈ భామ రామ్ చరణ్‌తో కలిసి పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్‌లో నటిస్తోంది. అంతే కాకుండా బీ టౌన్లో బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ అయిన డాన్ -3లో రణ్వీర్ సింగ్ సరసన జత కడుతోంది.