Amala Paul : హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె ‘బెజవాడ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘నాయక్, ఇద్దరమ్మాయిలతో’ వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక భాషతో సంబంధం లేకుండా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీలో కూడా సినిమాలు చేసిన ఈ బ్యూటీ. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా, క్రేజ్ మాత్రం బాగానే సంపాదించుకుంది. మెగా హీరోల పుణ్యమా అని స్టార్ హీరోయిన్ అయింది. అయినా కూడా ఎందుకో కానీ ఇక్క చెప్పుకోదగ్గ అవకాశాలు అయితే రాలేదు. దాంతో తమిళ, మళయాల ఇండస్ట్రీలకు వెళ్లిపోయింది.
అప్పట్లో దర్శకుడు ఎఎల్ విజయ్‌ని ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని అనివార్య కారణాల చేత చట్టబద్ధంగా అతడి నుంచి విడిపోయింది ఈ అమ్మడు.. ఇటీవల జగత్ దేశాయ్ అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అంతేకాదు ప్రస్తుతం అమలాపాల్ ఏడో నెల గర్భవతి అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రజెంట్ ఈ అమ్మడు నెట్టింట ట్రోల్స్ ఎదుర్కొంటోంది. అమలా పాల్ తాజాగా ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పంచుకుంది. తన భర్తతో ఓ పబ్‌లో డ్యాన్స్ వేస్తున్నట్లు కనిపిస్తోంది.
దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ‘ప్రస్తుతం నాకు ఏడో నెల నడుస్తోంది. కాబట్టి మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మీ అందరి ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో.. కొంత మంది పాజిటివ్‌గా కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఏడో నెలలో ఇలా పబ్‌లో డ్యాన్సులు చెయ్యడం అవసరమా అంటూ ఫైర్ అవుతున్నారు. మరికొందరు నెటిజన్స్ మాత్రం ఏడో నెలలో కాస్తా జాగ్రత్తగా ఉండాలి కదా.. ఇలా డాన్స్ వేస్తే.. బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుందని సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
View this post on Instagram