Rajamouli : రాజమౌళి మాట దాటని అలియాభట్.. ఆయన అంటే ఎందుకంత గౌరవం ?

- Advertisement -

Rajamouli : బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. వన్ ఆఫ్ ద స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆ సినిమాలోని ఓ కీలక పాత్రలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ మూవీ షూటింగ్ సమయంలో ఆలియా భట్, రాజమౌళి మధ్యన ఏదో గొడవ జరిగిందంటూ వార్తలు తెగ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వాటిలో నిజమెంతో తెలియదు గానీ.. తాజాగా అలియా భట్ రాజమౌళి పై చేసిన కామెంట్స్ మాత్రం ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అలియా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ తనకు రాజమౌళి ఇచ్చిన సజెషన్ ఇప్పటికీ ఫాలో అవుతున్నానంటూ చెప్పుకొచ్చింది. అలా నేను పూర్తిగా నా పద్ధతిని మార్చుకున్నానని వివరించింది.

సినిమాలను ఎంచుకునే టైంలో మొదటి నుంచి నేను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉండేదాన్ని.. ఈ విషయాన్ని ఓ టైంలో దర్శకుడు రాజమౌళికి చెప్పానని ఆయన ఏది చేసినా ప్రేమతో చేయండి.. అప్పుడు అది ఎంత కష్టమైనా పాత్ర అయినా మీకు సులువుగా అనిపిస్తుందని సూచించినట్లు చెప్పింది. ఎలాంటి ఫలితం వచ్చినా సరే ప్రేక్షకులు మీ నటనను మెచ్చుకుంటారు. మీకు కనెక్ట్ అవుతారని చెప్పారని.. ఈ ప్రపంచంలోనే ప్రేమతో చేసే పనికి మించిన గొప్పది ఏది ఉండదంటూ వివరించారని.. ఆయన చెప్పిన ఈ మాటలను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నానని అలియా భట్ చెప్పుకొచ్చింది.

- Advertisement -

సినీ కెరీర్ స్టార్టింగ్ లో నా దగ్గరికి వచ్చిన ప్రతి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే దాన్ని. వాస్తవానికి నాకు పేషన్సీ చాలా తక్కువ. ఇప్పుడు ఆ పద్ధతి పూర్తిగా మారింది. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు ఎంత కష్టమైనా పాత్రనైనా నటించడానికి ఫిక్స్ అయిపోయానంటూ అలియాభట్ వెల్లడించింది. ప్రస్తుతం ఈమె రాజమౌళి చెప్పిన ఆ విషయాలను ఇప్పటికీ పాటిస్తున్న అంటూ చేసిన కామెంట్స్ నెటింట్లో వైరల్‌గా మారాయి. ఇక ఆలియా ప్రస్తుతం జిగ్ర అనే బాలీవుడ్ మూవీలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here