Prabhas : సినిమాలంటే ఆషామాషీ కాదు. ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఒకే ఒక్క సినిమాతోనే రాత్రికి రాత్రే స్టార్ అయిపోవచ్చు.. అదే ఒక్క సినిమాతో ఇండస్ట్రీకి దూరం కావొచ్చు. సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చరిత్రను తిరగరాసే వారు మాత్రం కొందరే ఉంటారు. ఆ అరుదైన ఘనత దక్కించుకుంది అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. సీరియల్స్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్.. సీతారామం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇటీవల వచ్చిన హాయ్ నాన్న సినిమాతో మరో బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది .

త్వరలోనే విజయ్ దేవరకొండ తో కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. త్వరలోనే ఆ సినిమా రిలీజ్ కాబోతుంది. దీంతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుంటున్న మృణాల్ ఠాకూర్ కి సంబంధించిన ఓ వార్త నెట్టింట బాగా వైరల్ గా మారింది . ఒకే హీరోతో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల్లో ఛాన్స్ దక్కించుకోవడం చాలా రేర్ రికార్డ్ . అయితే తాజాగా అలాంటి ఘనతని అందుకుంది ఈ బ్యూటీ.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో వరుసగా మూడు సినిమాలకు కమిట్ అయింది. దీంతో ప్రస్తుత ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ క్రియేట్ చేయని సెన్సేషనల్ రికార్డ్ తన పేరిట నమోదైంది. కల్కి సినిమాలో మృణాల్ ఠాకూర్.. వన్ ఆఫ్ ద హీరోయిన్ గా నటిస్తుందన్న సంగతి తెలిసిందే. అలాగే రాజా సాబ్ సినిమాలో మృణాళ్ ఠాకూర్ వన్ ఆఫ్ ద హీరోయిన్ గా సెలెక్ట్ అయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వెంటనే హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ సినిమాలో కూడా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఫిక్స్ చేసుకున్నారట. ఇలా బ్యాక్ టు బ్యాక్ వరుసగా మూడు సినిమాలలోనూ ప్రభాస్ తో నటించబోతుంది. ఇప్పటివరకు ఏ హీరోయిన్ కూడా అందుకోని లక్కీ ఛాన్స్ ముద్దుగుమ్మ మృణాల్ అందుకోవడం గమనార్హం..!