Megastar Chiranjeevi : మెగాస్టార్‌ ఆ.. మజాగా.. ట్వీట్‌ వీర లెవల్‌ లో ఉందబ్బా..!

- Advertisement -

Megastar Chiranjeevi : ఎంత పెద్ద హీరో అయినా, ఎంత సంచలనం సృష్టించినా, ఎన్ని వివాదాలు సృష్టించినా సామాన్య పౌరుడు, భారతీయ పౌరుడిగా తన బాధ్యతలను మరచిపోని గొప్ప మనసు, సంస్కారం వున్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ ప్రతి మలుపులో సమాజం పట్ల తన బాధ్యతను ఎల్లప్పుడూ గుర్తించి తదనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతుంది. అందులో ఓటు హక్కు విలువ, ప్రాముఖ్యతను కూడా గుర్తు చేశారు. ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియా వీర లెవల్లో వైరల్ గా మారింది.

అందులో ఏముందంటే.. త్వరలో మన దేశంలో 18వ లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ విలువైన ఓటు హక్కు లభిస్తుంది. మీ మొదటి ఓటును దేశం మరియు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉపయోగించండి. తప్పక ఓటు వేయండి’’ అని పిలుపునిచ్చారు. అలాంటి వివషయాలు ఎవరు చెబుతారు? ఈ వ్యాపార ప్రపంచంలో ఎంతమంది సామాజిక బాధ్యతగా భావిస్తారు? ఎంత బిజీలో వున్న సరే ఓటు హక్కుపై మెగాస్టార్ చేసిన ట్వీట్ ఆయన వ్యక్తిత్వానికి ప్రతిరూపం.

Megastar Chiranjeevi

ఆయన ఎప్పుడూ దేనినీ నిర్లక్ష్యం చేయలేదు. కరోనా సమయంలో కూడా చేతులు కడుక్కోవడం ఎలా అని టీవీలో డెమో పోస్ట్ చేసిన విషయం తెలసిందే.. ఎంత సేపు చేతులు కడుక్కోవాలి. 20 సెకన్ల పాటు కడుక్కొని పరిశుభ్రంగా ఉండాలని, ప్రతి ఒక్కరికి డెమో ద్వారా.. తన వంతు కృషి చేశాడు. ఇదే కాదు తలాసేమియా వ్యాధి కారణంగా పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళ కోసం ఏం చేయాలనే తపన, ఆవేదన ఉంటుంది. చిరంజీవి తన వృత్తితో పాటు సామాజిక బాధ్యతల గురించి ఎప్పుడూ చెబుతుంటారు.

- Advertisement -

అందుకు తగ్గట్టుగానే చర్యలు తీసుకుంటున్నారు. పత్తి రైతులు మద్రాసులో ఉన్న సమయంలో చాలా నష్టపోయారని తెలిసి మెగాబ్రదర్ వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందించారు. అయితే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా ఆయనకు లేదు. క‌రోనా స‌మ‌యంలో సినిమా కార్మికులు ప‌ని లేకుండా క‌ష్ట ప‌డుతుంటే, ఆ దుస్థితిని మొట్ట‌మొద‌టిగా గుర్తించింది మెగాస్టార్‌ చిరంజీవి. వారికి కూడా సహాయం చేయాలని, ఆదుకోవాలని తెలిపిన వ్యక్తి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com