Aishwarya : ఒకప్పుడు సీరియల్స్ అంటే కుటుంబమంతా కలిసి చూడాలని ఉండేది. కానీ ఇప్పుడు సీరియల్స్ నిండా కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, దూషణలు, అక్రమ సంబంధాలే. కొంతమంది నటీనటులు సీరియల్స్‌కే పరిమితం కాలేదు. నిజ జీవితంలోనూ అదే ట్రెండ్‌ని ఫాలో అయి రెచ్చిపోతున్నారు. ఇటీవల ఓ సీరియల్ నటి నిర్వాకం వెలుగులోకి వచ్చింది.
ప్రముఖ బుల్లితెర నటి అడ్డాల ఐశ్వర్య భర్త శ్యామ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది సెప్టెంబరులో పెళ్లి చేసుకోగా, తనను మోసం చేశాడని ఆరోపించింది. ఐశ్వర్య ప్రస్తుతం పలు సీరియల్స్‌లో నటిస్తోంది. శ్యామ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, కాపు మ్యాట్రిమోనీలో ఈ సంబంధం వచ్చినప్పుడు, ఆమె సీరియల్‌గా నటిస్తుందని, ఆమెకు ఎటువంటి చెడు అలవాట్లు లేవని తల్లిదండ్రులు చెప్పారని, వారు గత సంవత్సరం సెప్టెంబర్‌లో వివాహం చేసుకున్నారని చెప్పారు. అందుకే కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి వైజాగ్‌లో జరిగింది. పెళ్లయిన కొద్ది రోజులకే ఐశ్వర్య చెడు అలవాట్లు బయటపడ్డాయని ఆమె భర్త చెబుతున్నాడు.

పెళ్లయిన 15 రోజుల తర్వాత హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చి సిగరెట్ తాగుతూ కనిపించింది. అయినా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆమె గదిలో రియల్టర్ కరణం రమేష్ బాబుతో పెళ్లి ఫొటోలు కనిపించాయి. పెళ్లయిన నెల రోజులకే రమేష్‌తో తనకున్న అక్రమ సంబంధం గురించి తెలుసుకుని, దానిని నిలదీశాడు భర్త అయితే.. వీరిద్దరూ కలిసి భర్తపై దాడి చేశారు.
ఇంతలో రమేష్ బాబు నుంచి బెదిరింపులు వచ్చాయి. అప్పటి నుంచి విడాకులు కావాలని వేధిస్తున్నారని, విడాకులు ఇవ్వకుంటే అక్రమ కేసులు పెడతామని వేధిస్తున్నారని.. ఓ సారి భౌతిక దాడి కూడా చేసిందని, ఈ విషయాన్ని ఐశ్వర్య తల్లిదండ్రులకు చెబితే వారు కూడా కూతురుకే వంత పాడున్నారని, శ్యామ్ కుమార్ మీడియాకు తెలుపుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

వారు ఇచ్చిన నగలు కూడా కనిపించకపోవడంతో వాటిని మాయం చేసిందని పేర్కొన్నాడు. ఈ క్రమంలో రమేష్ బాబు ఐశ్వర్యతో మాట్లాడిన ఆడియో కాల్స్ బయటపెట్టాడు. అప్పటి నుంచి ఆమె దూరంగా ఉండటం స్టార్ట్ చేసిందని శ్యామ్ కుమార్ వెల్లడించారు. అతడిని పెళ్లి చేసుకుని రూ. 25 లక్షలు కాజేసి ఇప్పుడు.. విడాకులు అడుగుతుందని వాపోయాడు.
రమేష్, ఐశ్వర్య ఇద్దరూ తనను బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. ఐశ్వర్య కూడా చాలా సినిమాల్లో నటించింది. త్రి ముఖి లాంటి సినిమాల్లో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం తెరపై బాగానే చేస్తోంది. ఐశ్వర్య.. అమ్మాయి గారు, పలుకే బంగారామాయేనా, అలా వైకుంఠపురం, అత్తారింటికి దారేది వంటి సీరియల్స్‌లో ఐశ్వర్య నటిస్తోంది.