హీరోయిన్ Sreeleela గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కొద్దికాలంగా అమ్మడి పేరు ఏ రేంజ్ లో మార్మోగిపోయిందో తెలిసిందే. కాకపోతే ఆమెపై ఇటీవల కొన్ని సందేహాలు జనాల్లో తలెత్తాయి. అసలు శ్రీలీల డ్యాన్సరా లేక నటినా అని. దీనికి సమాధానం ఎవరిని అడిగిన టక్కున ఆమె డ్యాన్సులకు మాత్రమే పనికొస్తుందని చెప్తున్నారు. కానీ ఆమె మాత్రం తన గురించి అలా అనుకోవడం లేదు.
నేను మంచి నటిని, కేవలం నన్ను డ్యాన్సుల కోసం వాడుకుంటానంటే ఇకపై కుదరదు. ఎంత పెద్ద సినిమా ఆఫర్ వచ్చినా కూడా గేటు బయట నుంచి బయటకే పంపించేస్తాను.. కానీ ఇకపై పర్ఫామెన్స్ కి స్కోపులేని పాత్రలు చెయ్యనంటే చేయను అంటూ భీష్మించుకుని కూర్చుంది ఈ ముద్దుగుమ్మ. రాఘవేంద్ర రావు స్కూల్ నుంచి వచ్చిన ఏ హీరోయిన్ అయినా మంచి పెర్ఫార్మర్ అవుతుంది లేదా మంచి గ్లామర్ రోల్స్ కి పనికొస్తుందని అంతా అనుకుంటారు. అందువల్లే శ్రీలీల మొదట్లో గ్లామర్ డాల్ అని అంతా భావించారు.
పెళ్లి సందడి సినిమా పరాజయం పాలైన తర్వాత ఏడాది పాటు ఖాళీగానే ఉంది. ఆ తర్వాత ధమాకాలో రవితేజకు దీటుగా దుమ్ము దులిపి అందరి దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది. ఇక అప్పటి నుంచి డ్యాన్స్ లకు మాత్రమే కేరాఫ్ అడ్రస్ గా అందరూ శ్రీలీలను ట్రీట్ చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత వచ్చిన స్కంద, ఆదికేశవ, గుంటూరు కారం సినిమాల్లో ఆమె డ్యాన్స్ మరో రేంజ్ లో ఉంది. అయితే డ్యాన్స్ లకు ఏ డ్యాన్సర్ ని పెట్టుకున్నా సరిపోతుంది. కోట్లకు కోట్లు కుమ్మరించి హీరోయిన్ ని ఎందుకు పెట్టుకుంటారు. అందుకే నేను ఇకపై డ్యాన్సులు చేసే ప్రసక్తే లేదంటోంది ఈ అమ్మడు. తను అలాంటి తప్పులు చేయబట్టే అందరూ డ్యాన్సర్ గా భావిస్తున్నారని.. పర్ఫామెన్స్ కి స్కోపు ఇవ్వకపోవడం వల్ల కొత్త పాత్రలు రాక.. తనలోని నటనను ప్రూఫ్ చేసుకోలేకపోతున్నానంటూ వాపోతుంది.
ఇది ఇలా ఉంటే.. ఇటీవల ఆమె కొత్త చిత్రాలేవీ ఒప్పుకోవడం లేదట. గౌతం తిన్ననూరి, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా తర్వాత ఆమె ఆచితూచి అడుగులు వేస్తోందట. భగవంత్ కేసరి సినిమా మినహా ఎవరూ కూడా తనలోని నటిని గుర్తించలేదని అలాంటి పర్ఫామెన్స్ మాత్రమే ఇకపై చూపిస్తానని.. అందుకోసమే తనకు మంచి పాత్రల్లో నటించే అవకాశం ఇవ్వమని దర్శకనిర్మాతలను కోరుతోంది. ఇకనైనా ఆమెలోని పర్ఫార్మర్ ని వాడుకుంటారా లేక కుప్పిగంతులకే పరిమితం చేస్తారా అనేది మన దర్శక నిర్మాతలపైనే ఆధారపడి ఉంది.