Aaradhya Bachchan : ఐశ్వర్యా కూతురు 12 ఏళ్లకే ఇంత పెద్దదానిలా కనిపంచడానికి.. కారణమిదేనా..!

- Advertisement -

Aaradhya Bachchan : ఒకప్పుడు హీరోయిన్స్ ఎలా ఉండేవారు.. ముద్దుగా, బొద్దుగా ఉన్నా కూడా అందంగా, కళగా ఉండేవారు. ముక్కు వంకర.. మూతి వంకర అని ట్రోల్ చేసేవాళ్ళు కూడా ఉండేవారు కాదు. ఎందుకు అంటే.. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి. కానీ, ఇప్పుడు అలా కాదు. ఎంత అందంగా ఉన్నా కూడా ఇంకా అందంగా కనిపించడానికి హీరోయిన్స్ సర్జరీలపై ఆధారపడుతున్నారు. అప్పుడెప్పుడో శ్రీదేవి తన ముక్కుకు సర్జరీ చేయించుకుంది. అప్పట్లో అదో పెద్ద సెన్సేషన్. కానీ, ఇప్పుడు ఒక హీరోయిన్ సర్జరీ చేయించుకుంది అంటే అదంతా కామన్ అని చెప్పుకొస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్యకు సర్జరీ చేయించిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఐశ్వర్య.. అభిషేక్ ను వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది. వీరికి ఆరాధ్య పుట్టింది.

Aaradhya Bachchan

ఆమె పుట్టిన దగ్గరనుంచి సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సృష్టిస్తూనే ఉంది. నిజం చెప్పాలంటే.. ట్రెండ్ కాదు కానీ, వివాదాలు అని చెప్పాలి. ఐశ్వర్య, ఆరాధ్య ఎప్పుడు బయటకనిపించినా.. కూతురు చేయి పట్టుకొనే నడుస్తూ ఉంటుంది ఐశ్వర్య. కూతురుకు కనీసం ఫ్రీడమ్ కూడా ఇవ్వడం లేదా.. ? లేక ఆరాధ్యకు మైండ్ మెచ్యూరిటీ లేక అలా పట్టుకుంటుందా.. ? అనే విషయం ఎవరికి తెలియదు. అయితే తాజాగా ఆరాధ్య హెయిర్ స్టైల్ మార్చడం.. బాలీవుడ్ ను షేక్ చేసిందనే చెప్పాలి. ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో ఐశ్వర్య, ఆరాధ్య కలిసి వచ్చారు.అందులో ఆరాధ్య ఫ్రింజ్ హెయిర్ స్టైల్ తో కాకుండా నీట్ గా మధ్య పాపిడి తీసి పక్కకు హెయిర్ ను లీవ్ చేసింది. అంతేనా డిజైనర్ డ్రెస్ లో మెరిసిపోయింది. సడెన్ గా చూస్తే హీరోయిన్ అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఇక ఈ ఫోటోలను చూసి.. ఆరాధ్య టోటల్ గా మారిపోయింది. ఐశ్వర్య.. ఆమెకు సర్జరీ చేయించి ఉంటుంది అంటూ పుకార్లు మొదలయ్యాయి. అయితే నిజానికి 12 ఏళ్లకే సర్జరీ చేయించారు అంటే నమ్మలేకుండా ఉన్నాం.. హెయిర్ స్టైల్, మేకప్ వలన ఆమె లుక్ మారింది తప్ప సర్జరీ లాంటివి ఏమి ఉండవేమో అని బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది. ఏదిఏమైనా ఈ లుక్ లో ఆరాధ్య హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వార్తలపై ఐశ్వర్య స్పందిస్తుందేమో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here