Nayanthara : ప‌క్క‌నే ఫ్లూటిస్ట్ వున్నా.. అక్క‌డ కూర్చొని ఆ ముద్దులేంటి న‌య‌న‌తార‌

- Advertisement -

Nayanthara : బహుమతులు ప్రతి ఒక్కరి జీవితంలో మంచి జ్ఞాపకాలు. కొందరు తమ ప్రియమైన వారికి సర్ ఫ్రైస్ బహుమతిని ఇచ్చి ఆశ్చర్యపరుస్తారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ దీన్నే ఫాలో అవుతుంటారు. అయితే కొంద‌రు సినీ, రాజ‌కీయ నాయ‌కులు బ‌హుమ‌తులు ఇస్తే.. అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంటాయిచ. తాజాగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తన భార్య నయనతారకు సర్ ఫ్రైజ్ బహుమతిగా ఇచ్చాడు. దీంతో విగ్నేషన్ పై ముద్దుల వర్షం కురిపించింది న‌య‌న్. ప్రస్తుతం వీరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Nayanthara

నయనతార.. సినీ ప్రియులకు ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోలతో పాటు నయనతారకు కూడా అంతే క్రేజ్ వచ్చింది. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అందరూ ఆమెను లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తుంటారు. నయనతారకు యువతలో విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే, ఆమె 2022లో తమిళ దర్శకుడు విఘ్నేషన్ శివన్‌ను వివాహం చేసుకుంది. వారు అద్దె గర్భం ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. తాజాగా ఈ జంటకు సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. నయనతార..విఘ్నేష్ శివన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను అన్‌ఫాలో చేయడంతో త్వరలో విడాకులు తీసుకోనున్నారనే టాక్ వ‌చ్చింది. ఈ నేపథ్యంలో విఘ్నేష్ షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.

నయనతార, విఘ్నేషన్ విడిపోతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. తాజాగా విఘ్నేష్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా నయనతారకు విగ్నేషన్ సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చినట్లు వీడియోలో ఉంది. నయన్ ,విఘ్నేష్ మీద కూర్చుంది. ఫేమస్ ఫ్లూటిస్ట్ నవీన్ వీరిద్దరి పక్కన బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు.

- Advertisement -

దీంతో నయనతార చాలా ఆశ్చర్యపోయింది. అతను వాయించిన వేణువుకి ముగ్ధు రాలైన‌ నయన విఘ్నేష్‌పై ముద్దుల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మొత్తానికి నయనతార, విఘ్నేష్ విడిపోతున్నారనే ఫేక్ న్యూస్ కు ఈ వీడియో చెక్ పెడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే విడాకులు విష‌యం ఫేక్ అయినా.. న‌య‌న్ చేసిన ప‌ని మాత్రం బాగోలేద‌ని నెటిన్లు కామెంట్లు చేస్తున్నారు. అది ఏంటంటే.. ప‌క్క‌న్ ఫ్లూటిస్ట్ కూర్చున్న త‌న భ‌ర్త వొల్లో కూర్చిని అలా ముద్దులు పెట్ట‌డం ఏంట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. న‌య‌న్ నువ్వు మంచి భార్య‌వే కానీ.. ప‌క్క‌న ఒక మ‌నిషి ఉన్నాడ‌ని కూడా సోయ‌లేకుండా పోయిందా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here