Vyuham Review : వ్యూహం వైపే అంద‌రి చూపు.. మ‌ళ్లీ జ‌గ‌న్ సీఎం అంటున్నఅభిమానులు

- Advertisement -

Vyuham Review : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల తేదీ సమీపిస్తోంది. ఈసారి ఎన్నికలు రసవత్తరంగా ఉండబోతున్నాయన్న ఆలోచన కూడా ప్రజల్లో ఉంది. ఈ సీజన్‌ని క్యాష్ చేసుకునేందుకు కొందరు మేకర్స్ రాజకీయ నేపథ్యంలో తీసిన సినిమాలను లైన్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ‘యాత్ర 2’, ‘రాజధాని ఫైల్స్’ వంటి రాజకీయ చిత్రాలు వచ్చాయి. అయితే అందరి దృష్టి రాంగోపాల్ వర్మ ‘వ్యూహం’పైనే ఉంది. ఎందుకంటే ఆయన చేసిన పబ్లిసిటీ అలాంటిది. పైగా ఈ సినిమా సెన్సార్ కష్టాలు, కోర్టు కేసులు ఇలా చాలా హడావిడి ఎదుర్కొని.. అటువంటి అన్ని అడ్డంకులు దాటుకుని ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ‘వ్యూహం’ ఎలా ఉందంటే..

Vyuham Review

హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీఎం వీర శేఖర్ రెడ్డి కొడుకు మదన్ (అజ్మల్ అమీర్)ని ముఖ్యమంత్రి చేసేందుకు 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేస్తారు. కానీ భారత్ పార్టీ మాత్రం మేడమ్ మదన్‌ను కాదు కాశయ్యను సీఎం చేస్తుంది. మరోవైపు మదన్ కు కూడా ఓదార్పు యాత్రను ఆపేయాలని ఆదేశిస్తారు. కానీ మదన్ దానిని పట్టించుకోకుండా ఓదార్పు యాత్రను కొనసాగిస్తాడు. ఈ క్రమంలో అతనిపై దాడులు, కేసులు, విచారణలు జరుగుతున్నటు వంటివి.. ఆ కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్లి… చివరకు పార్టీని ఎలా నిలబెట్టుకోగలిగాడు? ఇంద్ర బాబు, శ్రవణ్ కళ్యాణ్ వల్ల మదన్ కి వచ్చిన సమస్యలు ఏమిటి? తర్వాత సీఎం ఎలా అయ్యారు? అన్నది మిగతా కథ. ‘యాత్ర 2’ కథ కూడా అదే కానీ.. కాకపోతే ఆ సినిమాలో వివాదాలకు పెద్దగా కాంట్రవర్శిలకు స్కోప్ ఇవ్వలేదు దర్శకుడు మహి వి రాఘవ్. జగన్ పార్టీకి మద్దతిచ్చినట్లే ఆ సినిమా తీశాడు. జనసేన, షర్మిల వంటి అంశాల జోలికి కూడా వెళ్లలేదు. అయితే రాంగోపాల్ వర్మ అలా కాదు.. నిజ జీవితంలో ఏం జరుగుతుందో అదే వ్యూహంలో తెరపైకి తీసుకువచ్చాడు. దానివల్ల అందరికి వైసీపీ వైపు స్టోరీ అని అనుకున్నా.. అవన్నీ పక్కకు పెట్టి.. ఇప్పుటి వరకు జగన్‌ ఏపీ ప్రజలకోసం ఏం చేస్తున్నాడు. భవిష్యత్తులు ఏం చేయబోతున్నాడు అనేది ఇందులో చూపించేందుకు ప్రయత్నం చేశాడు.

ఎంత కష్టమెచ్చినా నవ్వుతూ ముందుకు సాగుతున్న సీఎంను ప్రతి పక్షపార్టీలు చేస్తున్న సెటైర్లను సైతం నవ్వుతూ.. భరిస్తూ తను అనుకున్నది వ్యూహం ఏంటని ఇందులో చూపించాడు వర్మ. సినిమా చూసేకి సాగుతుంది అనిపించినా.. ఇంట్రెస్టింగ్‌ గా ఈ సినిమాను చూస్తే.. జగన్‌ పై సీఎం కావడానికి ఎవరు ఏం.. ఏం పన్నాగం పన్నారు. అనేది మనం వ్యూహంలో చూడొచ్చు. ఇది కేవలం వైసీపీ చెందినదే అని చాలామందికి మైండ్‌లో ఉండిపోవడం వలన దీనికి వైసీపీ అభిమానులు మాత్రమే వెళతారు అని టాక్‌ వచ్చింది. నిజం చెప్పాలంటే..అప్పట్లో సీఎం గా ఉన్న రాజశేఖర్‌ రెడ్డి చనిపోయిన తరువాత ఏపీ రాజకీయాల్లో ఏం జరిగింది.. జగన్‌ కు నమ్మించి ఎలా వెన్నుపోటు పోడిచారు అనేది ఈ కథ.. పవన్‌, బాబు ఏవిధంగా వ్యూహం పన్ని సెటైర్లు వేస్తున్నారో.. అటువంటి వాటినికి నవ్వుతూ భరిస్తూ ముందుకు సాగుతూ.. ప్రజలకు ఇవ్వాల్సిన నవరత్నాలు అన్నీ నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నదే ఈ వ్యూహం కథాంశం.

- Advertisement -

రన్ టైమ్ 2 గంటల 2 నిమిషాలు మాత్రమే. ఇందులో జ‌గ‌న్‌, చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఈ ముగ్గ‌రు పాత్ర‌ల్లోనే సినిమా అంతా ఉంది. నిజం చెప్పాలంటే న‌డుస్తున్న రాజ‌కీయం పై రాంగోపాల్ వ‌ర్మ ఫోక‌స్ పెట్టాడు. దీంతో కొంద‌రికి వైసీపీ కి మాత్ర‌మే అన్న‌ట్లు డైరెక్ట‌ర్ తీసాడు అన్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వ్యూహంలో సినిమాలో జ‌గ‌న్ లా న‌టించిన వ్య‌క్తి అజ్మల్.. అతని నటనకు హాట్స్‌ ఆఫ్‌ చెప్పాలి.. జగన్‌ గా సూప‌ర్ గా సెట్ చేశాడు రాంగోపాల్ వ‌ర్మ‌. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’లో జగన్ పాత్రను కూడా అజ్మల్ పోషించిన విషయం తెలసిందే. అచ్చం జ‌గ‌న్ మాటలు, న‌డ‌క‌, ధీవి, నవ్వు.. న‌మ‌స్తే అంటూ పెట్టే సీన్లు మాత్రం ఏపీ సీఎం జ‌గ‌న్ ను ఒక హీరోగా చూసిన‌ట్లే ఉంటుంది. ఏదిఏమైనా ఇప్పుడున్న రాజ‌కీయాల్లో జ‌గ‌న్ కున్న క్రేజ్ ని వ్యూహం సినిమాలో డైరెక్ట్ గా చూపించాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com