Hero Madhavan : ఒకప్పటి హీరో మాధవన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సఖి సినిమాతో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. అయితే ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. మాధవన్ ప్రస్తుతం OTTలో వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ప్రస్తుతం రైల్వే మెన్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఇందులో జూహీ చావ్లా నటించింది. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లో మాధవన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
కెరీర్ తొలినాళ్లలో జుహ్లీ చావ్లాను పెళ్లి చేసుకోవాలనుకున్న విషయాన్ని తన తల్లికి కుడా చెప్పానని తన మనసులో మాటను పబ్లిక్ గా చెప్పేశాడు. ప్రస్తుతం మాధవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఖయామత్ సే ఖయామత్ లో జుహీ చావ్లాను చూసి చాలా ఇష్టపడ్డా అని.. పెళ్లి చేసుకోవాలనుకున్నాఅని తెలిపాడు. ఆ సమయంలో నా లక్ష్యం ఆమెను పెళ్లి చేసుకోవడమే. ఇదే విషయాన్ని మా అమ్మకు చెప్పానని చెప్పాడు. అయితే అప్పట్లో జూహీతో సినిమా చేసే అవకాశం కూడా రాలేదని చెప్పాడు. ఈ ఈవెంట్‌చుసిన వాళ్ళందరూ మాధవన్ నీలో ఇంతవుందా అని కామెంట్లు చేస్తున్నారు.
ఖయామత్ సే ఖయామత్ తక్ చిత్రం హిందీలో మన్సూర్ ఖాన్ దర్శకత్వం వహించారు, ఇందులో అమీర్ ఖాన్, జూహీ నటించారు. 1988లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా కూడా ఇదే. ఈ చిత్రం ఉత్తమ నటి తెరంగేత్రం అవార్డుతో సహా ఎనిమిది ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. ఖయామత్ సే ఖయామత్ తక్ విడుదలైనప్పుడు, మాధవన్ ఇంకా నటుడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించలేదు. సఖి సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయం అయ్యాడు మాధవన్. ఆ తర్వాత తమిళంలో పలు హిట్ చిత్రాల్లో నటించారు. 2001లో రెహానా హై తేరే దిల్ మేతో చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.