Rashmika Mandanna : స్టార్ హీరోయిన్ ఒక పోస్ట్ పెట్టిందంటే చాలు లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్స్ వస్తుంటాయి. మాములుగా సెలబ్రెటీలు వాటిని చదవరు. మిర్రర్ సెల్ఫీ తీసుకున్నావ్ అదే గ్యాప్ లో నాకొక రిప్లై ఇవ్వొచ్చుగా అని రష్మికను ట్యాగ్ చేశాడు. రష్మిక రిప్లయ్ ఇచ్చిందో లేదో.. సోషల్ మీడియా మొత్తం అది వైరల్ అయిపోయింది.
స్టార్ హీరోయిన్ల నుంచి స్మాల్ స్క్రీన్ సెలబ్రెటీల వరకు అందరూ సోషల్ మీడియాలో తమ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు ఫోటోలు కూడా పంచుకుంటుంటారు. స్టార్ హీరోయిన్ ఒక పోస్ట్ పెట్టిందంటే చాలు లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్స్ వస్తుంటాయి. మాములుగా సెలబ్రెటీలు వాటిని చదవరు. వాళ్లకు అవన్నీ చదివే టైమ్ కూడా ఉండదు. అయితే తాజాగా స్టార్ హీరోయిన్ రష్మిక మాత్రం ఓ ఫ్యాన్ కు రిప్లై ఇచ్చింది. రీసెంట్ గా ఈ బ్యూటీ మిర్రర్ ముందు దిగిన సెల్ఫీ ఫోటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు క్షణాల్లోనే తెగ వైరల్ అయిపోయాయి. కాగా ఈ ఫోటోలను రష్మిక అభిమాని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. మిర్రర్ సెల్ఫీ తీసుకున్నావ్ అదే గ్యాప్ లో నాకొక రిప్లై ఇవ్వొచ్చుగా అని రష్మికను ట్యాగ్ చేశాడు. కాగా ఆ కామెంట్ కు రష్మిక స్పందించి.. గ్యాప్ లో అంట.. వర్క్ గ్యాప్ లో ఈ సెల్ఫీ తీసుకున్నారా.. సెల్ఫీ తీసుకునే టప్పుడు గ్యాప్ లేకుండే అని స్మైల్ ఎమోజీస్ తో రిప్లయ్ ఇచ్చింది. ఇలా రష్మిక రిప్లయ్ ఇచ్చిందో లేదో.. సోషల్ మీడియా మొత్తం అది వైరల్ అయిపోయింది.
రిప్లయ్ ఇచ్చిన సంగతి పక్కన పెడితే.. తను తెలుగులో రిప్లయ్ ఇవ్వడం, అది కూడా అచ్చ తెలంగాణ యాసలో కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయిపోయింది. అయితే రా అంటూ అభిమానిని ప్రస్తావించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నువ్వు రా అంటుంటే చాలా బాగుంది అంటూ మళ్లీ ఆ అభిమాని కామెంట్ చేయడం వైరల్ అయ్యింది.ఇక ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లతో అనతికాలంలో అగ్ర కథానాయికగా మారిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ప్రతీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో జోడీ కడుతూ పాన్ ఇండియా హీరోయిన్ గా పాపులారిటీ తెచ్చుకుంది. ‘పుష్ప’ తర్వాత రీసెంట్ గా వచ్చిన ‘యానిమల్’ సినిమా ఈ బ్యూటీకి ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. మరీ ముఖ్యంగా గీతాంజలి రోల్ లో జీవించేసింది. కొన్నిసీన్లలో రణ్ బీర్ కూడా డామినేట్ చేసిందటే.. ఈ కన్నడ బ్యూటీ ఏ రేంజ్ లో యాక్టింగ్ కుమ్మేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజను సినిమాలున్నాయి. అందులో ‘పుష్ప’ సీక్వెల్ కూడా ఒకటి. ఇవే కాకుండా తెలుగులో ‘రేయిన్ బో’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ అంటూ రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తుంది.