Actress : నావి చిన్నగా ఉన్నాయి.. సైజులు పెంచుకోవడానికి సర్జరీ చేయించుకోవాలనుకున్న

- Advertisement -


Actress : హాట్ హాట్ అందాలను దాచుకోకుండా ప్రేక్షకుల కోసం వడ్డించే హీరోయిన్ సమీరా రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన సమీరా హిందీ, తమిళం, తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన నరసింహుడు చిత్రంలో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో అమ్మడు భారీగా అందాలను ఆరబోసింది. అయినా ఈ మూవీ బాక్సాఫీసు వద్ద పెద్దగా విజయం సాధించలేకపోయింది. తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘జై చిరంజీవ’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.

ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో అమ్మడి ఖాతాలో ఓ సక్సెస్ పడినట్లైంది. దీంతో మరో సారి.. తన మూడో మూవీ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి అశోక్ అనే సినిమాలో నటించింది. అప్పుడే వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందంటూ రూమర్స్ వినిపించాయి. ఏకంగా ఎన్టీఆర్-సమీరా పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున నెట్టింట్లో వార్తలు వచ్చాయి. కానీ 2014 లో సమీరా పెళ్లి చేసుకుని నటనకు గుడ్ బై చెప్పింది. తాజాగా సమీరా రెడ్డి ఓ ఇంటర్వ్యూకు హాజరై.. తనకు ఎదురైన అనుభవాలను చెప్పుకొచ్చింది.

‘‘బాడీ షేమింగ్ గురయ్యాను. బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉందని నెగిటివ్ కామెంట్స్ చేశారు. సైజ్ పెరిగెందుకు సర్జరీ చేయించుకోమని కూడా సలహా ఇచ్చారు. ఈ కామెంట్స్ నాపై ఒత్తిడికి కారణమయ్యాయి. దీంతో సర్జరీ చేయించుకోవాలని ఫిక్స్ అయ్యాను. కానీ చేయించుకోలేదు. బ్రెస్ట్ సైడ్ పెద్దదిగా కనిపించేందుకు ప్యాడ్స్ ఉపయోగించేదాన్ని. సర్జరీ వల్ల పలు ప్రాబ్లమ్స్ ఎదురవుతాయని ఆలోచించి.. సర్జరీ చేయించుకోలేదు’’. అంటూ సమీరా రెడ్డి ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రస్తుతం సమీరా రెడ్డి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here