Bigg Boss Divi : బిగ్ బాస్ కు వెళ్లకముందు సినిమాల్లో హీరోయిన్లకు ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసిన దివి.. బిగ్ బాస్ కు వెళ్లిన తర్వాత మెగాస్టార్ పుణ్యమా అని సినిమాల్లో ప్రముఖ పాత్రల్లో నటించే అవకాశం వచ్చింది. చిరు నటించిన గాడ్‌ఫాదర్‌లో నటించడమే కాకుండా మరికొన్ని చిత్రాలలో కనిపించారు దివి. దానితో పాటు స్పెషల్ ఫోటో షూట్‌లతో సోషల్ మీడియాలో వైరల్ నిలిచారు దివి. అంతే కాకుండా డ్యాన్స్ షోలలో కూడా కనిపించారు . అయితే వెండితెరపై తళుక్కున మెరవాలంటే.. ఆమెకు అంతగా వర్కుట్ కాలేదు.
తాజాగా దివి తన బ్రేకప్ లవ్ స్టోరీని బయటపెట్టింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను బీటెక్ చదివే సమయంలో ఓ అబ్బాయితో ప్రేమలో పడ్డాను, ఎంటెక్ చదివే వరకు మా మధ్య రిలేషన్ షిప్ ఉంది. పెద్దలను ఒప్పించి పెళ్లి తేదీలు ఫిక్స్ చేశాం. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో నా లవ..ర్.. తమ్ముడు అనారోగ్యంతో చనిపోయాడు. నా లవర్ తమ్ముడు చివరి క్షణాల్లో నేను అతనితో ఉన్నాను. తను చనిపోయిన తర్వాత కూడా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యే వరకు న లవర్ వెంటే ఉన్నాను.
తమ్ముడు చనిపోవడంతో తను గ్రామంలోనే తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. తాను హైదరాబాద్‌కు రానని చెప్పాదడు. నా ప్రొఫెషన్ దృష్ట్యా నన్ను అతను ఊరికి తీసుకెళ్లలేదు. చాలా రోజుల తర్వాత నాకు ఈ విషయం తెలిసింది. అందుకే విడిపోయాం.. బ్రేకప్ స్టోరీని పంచుకుంటూ దివి భావోద్వేగానికి గురయ్యారు.