Nandamuri Taraka Ratna : నందమూరి కుటుంబం నుండి ఇండస్ట్రీ కి వచ్చి తన పరిధిలో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న తారకరత్న, నేడు మన అందరినీ వీడి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఆకస్మిక మరణం నందమూరి అభిమానులను మాత్రమే కాకుండా, యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. ఆయన కెరీర్ లో చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ హిట్లు లేకపోవచ్చు కానీ, ప్రేక్షకులు గుర్తించుకోదగ్గ పాత్రలు మాత్రం చాలానే ఉన్నాయి.
సినిమా కెరీర్ అయిపోయాక రాజకీయంగా బాగా బిజీ అవ్వాలని తెలుగు దేశం పార్టీ లో మళ్ళీ యాక్టీవ్ అయ్యాడు. నారాలోకేష్ తపెట్టిన యువగళం ప్రారంభోత్సవం లో పాల్గొన్న ఆయన అకస్మాత్తుగా స్పృహ తప్పి క్రింద పడిపోవడం, ఆ తర్వాత ఆయన్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లడం, కొన్ని రోజులు గడిచాక ఆయన చికిత్స పండుతూ మరణించడం వంటివి జరిగాయి, ఇది జరిగి దాదాపుగా ఒక ఏడాది పూర్తి అయ్యింది.
ఇదంతా పక్కన పెడితే తారకరత్న కెరీర్ ప్రారంభం లో ‘భద్రాద్రి రాముడు’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేదు కానీ, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కుట్టి రాధికా అనే అమ్మాయి నటించింది. ఈమె కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి ని పెళ్లాడింది. చూసేందుకు ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ కంటే ఎంతో అందంగా కనిపిస్తుంది.
అప్పట్లో తారక రత్న తో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ, ఏకంగా ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకుంటుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ప్రస్తుతం ఈమె సినిమాల్లో నటనకు దూరంగా ఉంది కానీ, సినిమాల నిర్మాణం మాత్రం వదలలేదు. యంగ్ హీరోలతో పాటుగా, క్రేజీ స్టార్ హీరోలతో కూడా ఈమె అనేక సినిమాలు చేస్తూ వచ్చింది. తెలుగు లో ఈమె భద్రాద్రి రాముడు తర్వాత మరో సినిమాలో నటించలేదు.