Ira Khan : ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ పుట్టినరోజు జరుపుకుంది. అయితే ఈసారి స్విమ్మింగ్ పూల్ లో సందడి చేస్తూ ఓ ప్రైవేట్ ప్లేస్ లో తన కుటుంబం, స్నేహితులతో కలిసి వేడుకలు జరుపుకుంది. ఇరా ఖాన్ ఈ పార్టీ మొత్తం బికినీలో ఉంది. అతని స్నేహితులు కూడా అలాగే ఉన్నారు. కేక్ కూడా బికినీలో కట్ చేశారు. అయితే తల్లిదండ్రుల సమక్షంలోనే బికినీలో కేక్ కట్ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
దీంతో ఇరా ఖాన్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అయింది. బికినీలో బర్త్ డే పార్టీ చేసుకుంటే ఎలా ఉంటుంది, బికినీలో కేక్ కట్ చేస్తే ఎలా ఉంటుంది, పేరెంట్స్ ముందు అలా బికినీలో ఉంటే ఎలా ఉంటుంది అంటూ చాలా మంది ఇరా ఖాన్ ను ట్రోల్ చేశారు.

అయితే తాజాగా ఇరా ఖాన్ ఈ ట్రోలింగ్కి కౌంటర్ ఇచ్చింది. అయితే ఈ కౌంటర్ మరింత ట్రోల్ చేసేలా ఉంది. నేను ఇటీవల సోషల్ మీడియాలో మరిన్ని పుట్టినరోజు బికినీ ఫోటోలను పంచుకున్నాను.. మీరు నా పుట్టినరోజు ఫోటోలను ద్వేషించడం, ట్రోల్ చేయడం ఆపేశారా? ఇదిగో మీకోసమే మరిన్ని ఫోటోలు షేర్ చేస్తున్నా.. అంటూ పోస్ట్ చేసింది. అయితే.. కొంతమంది ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చింది అంటుంటే, మరి కొంతమంది దీంతో అగ్నికి ఆజ్యం పోసినట్టు మళ్ళీ ట్రోలర్స్ ని కావాలని గెలికి ట్రోలింగ్ చేయించుకుంటుంది ఇరా అంటున్నారు. మరికొంతమంది నెటిజన్లు అయినా ఎంత ట్రోల్ చేసినా ఈ బాలీవుడ్ స్టార్ కిడ్స్ అంతేగా, వాళ్ళు మారరు అని కామెంట్స్ చేస్తున్నారు.