Shruti Haasan : సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరైన కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శృతి హాసన్, తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుని నటన పరంగా తనలోని విలక్షణత చూపించి అతి తక్కువ కాలం లోనే సౌత్ లో బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. కమల్ హాసన్ కూతురు అయ్యినప్పటికీ కూడా ఎన్నడూ అవకాశాల కోసం ఆయన పేరుని ఉపయోగించుకోలేదు.
కేవలం ఆమె సొంత టాలెంట్ ని నమ్ముకొనే ఇంత దూరం వచ్చింది. ఈమె తర్వాత ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ ఇండస్ట్రీ కి వచ్చారు కానీ, శృతి హాసన్ జోరుని మాత్రం ఆపలేకపోయారు. ఇప్పటికీ కూడా ఆమె పెద్ద పెద్ద పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ లో మెయిన్ ఫిమేల్ లీడ్ రోల్స్ చేస్తుంది. ఆమె గత చిత్రం ‘సలార్’ ఎంతపెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మనమంతా చూసాము.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కమల్ హాసన్ గురించి శృతి హాసన్ చేసిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘మా నాన్న నాకు కావాల్సినవి అన్నీ ఇచ్చారు. ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు.
చిన్నప్పుడు ఎక్కువగా ఆయనతోనే నేను గడిపేదానిని, ఆయన ఇప్పటికీ కూడా ఎంత బిజీ గా ఉన్నా నాకోసం సమయం కేటాయిస్తారు, ఆయన పుట్టినరోజు వేడుకలను ఎంతో గ్రాండ్ గా చేసేదానిని, కానీ నేను 25 వ ఏటలో ఉన్నప్పుడు నాన్న పుట్టిన రోజు పార్టీ ని ఘనంగా నిర్వహించాను, ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్లందరినీ పిలిచాను, అందరూ వచ్చారు, కానీ నాన్న మాత్రం ఆరోజు షూటింగ్ లో బిజీ గా ఉండడం వల్ల రాలేకపోయాడు. ఆరోజు నేను ఆయన మీద చాలా కోపం తెచ్చుకున్నాను. ఇప్పటికీ ఆ సంఘటన తల్చుకుంటే కోపం వచ్చేస్తుంది’ అని చెప్పుకొచ్చింది.