SSMB29 : ఈగ, బాహుబలి 1&2, ఆర్ ఆర్ ఆర్… రాజమౌళి చేసిన ఇటివలే చేసిన భారి బడ్జట్ సినిమాల టైటిల్స్. తెలుగు సినిమా మార్కెట్ ని హాలీవుడ్ రేంజుకి తీసుకోని వెళ్లిన రాజమౌళి… ఈ సినిమాల అనౌన్స్మెంట్ సమయంలో కథని చెప్పేసి, సినిమా ఎలా ఉండబోతుందో ముందే క్లియర్ గా చెప్పేస్తాడు. ఆర్ ఆర్ ఆర్ సమయంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమా కథ అల్లూరి సీతారామరాజు-కొమురం భీమ్ పాత్రలపైన కల్పితంగా రూపొందించిన కథతో సినిమా చేస్తున్నా అని చెప్పేసాడు. ఆర్ ఆర్ ఆర్ టైటిల్ కూడా అనౌన్స్మెంట్ అప్పటినుంచే ఫిక్స్ అయిపొయింది.
ఆ తర్వాత ఇతర పదాలు వచ్చినా కూడా లాస్ట్ కి అది ఆర్ ఆర్ ఆర్ గానే ఫైనల్ అయ్యింది. ఇందులో ఒక ‘ఆర్’ రాజమౌళి, ఇంకో ‘ఆర్’ రామారావు, మూడో ‘ఆర్’ రామ్ చరణ్. ఇలా ముగ్గురి పేర్ల నుంచి ఆర్ అనే అక్షరాన్ని తీసుకోని ఆర్ ఆర్ ఆర్ టైటిల్ ఫార్మేషన్ ని చేసారు.
రాజమౌళి ఇదే లాజిక్ అన్ని సినిమాలకి ఫాలో అవుతుందని అనుకుంటూ సోషల్ మీడియాలో… SSRMB ప్రాజెక్ట్ టైటిల్ ని కొంతమంది వైరల్ చేస్తున్నారు.
ముందు SSMB 29, ఆ తర్వాత SSRMB అయిన ఈ ప్రాజెక్ట్ కి ‘MAHRAJA’ అనే టైటిల్ లాక్ అయ్యింది అనే వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మహేష్ పేరులో నుంచి MAH… రాజమౌళి పేరులో నుంచి RAJAని కలిపి ‘MAHRAJA’ చేసారు. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా వెయ్యి కోట్ల బడ్జట్ తో తెరకెక్కనున్న సినిమాకి రాజమౌళి ఇంత సింపుల్ గా టైటిల్ లాక్ చేసే అవకాశమే లేదు. అన్ని ప్రాంతాల వారికి, వెస్ట్రన్ కంట్రీస్ పబ్లిక్ కి కూడా కనెక్ట్ అయ్యే టైటిల్ తోనే రాజమౌళి – మహేష్ సినిమా ఉంటుంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ భారీ బడ్జట్ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ సమయంలోనే రాజమౌళి ఓపెన్ గా టైటిల్ అండ్ కంటెంట్ ఐడియా గురించి రివీల్ చేస్తాడు. అప్పటివరకు ఇలాంటి వార్తలు అన్నీ రూమర్స్ గా మాత్రమే చూడాలి.