నటీనటులు : సందీప్ కిషన్, కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ, వైవా హర్ష, వెన్నెల కిషోర్ తదితరులు.
దర్శకుడు : వీఐ ఆనంద్.
సంగీతం : శేఖర్ చంద్ర.
నిర్మాత : రాజేష్ దందా.
సినిమాటోగ్రఫీ : రాజ్ తోట
Ooru Peru Bhairavakona Review : చాలా కాలం నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లెక్క ఇబ్బంది పడుతున్న సందీప్ కిషన్, ఒక మంచి కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకోసం విభిన్నమైన కథలను ఎంచుకుంటూ రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు కానీ కమర్షియల్ సక్సెస్ మాత్రం రావడం లేదు. అయినప్పటికీ కూడా ఆయన ప్రయత్నాలు ఆగడం లేదు. రీసెంట్ గా ఆయన ‘ఊరి పేరు భైరవకోన’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమాకి సంబంధించిన పాటలు, టీజర్ , ట్రైలర్ ఇలా ప్రతీ ఒక్కటి కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలా భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. మరి ఆడియన్స్ నుండి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఒకసారి ఈ రివ్యూ లో చూద్దాము.
కథ :
బసవ (సందీప్ కిషన్), జాన్ (వైవా హర్ష) అనే ఇద్దరు స్నేహితులు చిన్నతనం నుండి కలిసి మెలిసి ఉంటారు. బసవ సినిమాల్లో స్టంట్ మాస్టర్ గా కొనసాగుతూ ఉన్నత స్థాయికి చేరాలని అనుకుంటూ ఉంటాడు. కానీ అతను చేసిన ఒక తప్పు వల్ల జీవితం లో ఎన్నో మలుపులు చోటు చేసుకుంటుంది. మరోపక్క ఆయన భూమి (వర్ష బొల్లమ్మ) తో ప్రేమలో ఉంటాడు. ఒక రోజు బసవ , జాన్ ఇద్దరు కలిసి ఒక దొంగతనం చేసి తప్పించుకోవాలని అనుకుంటారు. అలా వీళ్లిద్దరు కలిసి ఒక కారులో ప్రయాణిస్తుండగా రోడ్డు మీద గీత (కావ్య థాపర్) అనే అమ్మాయి పడిపోయి ఉంటుంది. ఇది గమనించిన బసవ ఆమెని హాస్పిటల్ లో చేర్చడానికి కార్ లో ఎక్కించుకొని వెళ్తాడు, అలా వెళ్తూ మధ్యలో భైరవ కోన అనే ఊరుకి చేరుకోవాల్సి వస్తుంది. ఆ ఊరిలో విచిత్రమైన మనుషులు, భయానక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మిగతా ఊర్లకు , భైరవ కోన కి ఎందుకు అంత వ్యత్యాసం?, ఆ ఊరిలో పరిస్థితులు ఎందుకు అలా ఉన్నాయి అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ :
ఇలాంటి ఫాంటసీ సినిమాలు ఈమధ్య టాలీవుడ్ లో బాగా వర్కౌట్ అవుతున్నాయి. కానీ ఈ జానర్ చిత్రాలలో ఎమోషన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవ్వాలి, అప్పుడే సక్సెస్ కాగలరు. ఈ సినిమాలో జానర్ కి తగ్గట్టు అన్నీ ఉన్నాయి కానీ, ఎమోషన్ మాత్రం వర్కౌట్ అవ్వలేదు, అదొక్కటే ఈ చిత్రం లో మైనస్ గా చెప్పుకోవచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఆసక్తికరంగా, తర్వాత ఏమి జరగబోతుందా అనే విధంగా స్క్రీన్ ప్లే ఉంటుంది. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే ఆడియన్స్ మైండ్ ని బ్లాక్ చేసే విధంగా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ ని అదే తరహా స్క్రీన్ ప్లే తో నడిపించడం లో డైరెక్టర్ విఫలం అయ్యాడు. సీరియస్ గా ఉండాల్సిన అనే సందర్భాల్లో అనవసరపు కామెడీ ని క్రియేట్ చేసి సినిమా ఫ్లో కి స్పీడ్ బ్రేకర్స్ వేసాడు డైరెక్టర్. ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది అనిపిస్తుంది కానీ, సెకండ్ హాఫ్ ఇంకా కాస్త సీరియస్ గా తీసి ఉంటే ‘విరూపాక్ష’ రేంజ్ బ్లాక్ బస్టర్ అయ్యేది అని విశ్లేషకుల అభిప్రాయం.
సందీప్ కిషన్ ఎప్పటి లాగానే ఈ సినిమాలో కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించాడు. వివిధ షేడ్స్ లో ఆయన క్యారక్టర్ ని కూడా చాలా చక్కగా తీర్చి దిద్దాడు డైరెక్టర్ ఆనంద్. ఇక హీరోయిన్ గా నటించిన వర్ష బొల్లమ్మ కూడా తన క్యూట్ లుక్స్, అందమైన హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే సెకండ్ హీరోయిన్ గా చేసిన కావ్య థాపర్ కూడా తన పాత్ర పరిధిమేర చాలా చక్కగా ఆకట్టుకుంది. వైవా హర్ష, వెన్నెల కిషోర్ కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక డైరెక్టర్ విఐ ఆనంద్ కూడా మరోసారి తన మార్క్ టేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చిన్న చిన్న తప్పులను పక్కన పెడితే ఈ సినిమా ఆడియన్స్ కి మంచి థియేట్రికల్ అనుభూతిని కలిగిస్తుంది అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
చివరిమాట :
చాలా కాలం తర్వాత విడుదలైన మంచి థ్రిల్లర్ జానర్ చిత్రం. ప్రేక్షకులకు కచ్చితంగా ఈ సినిమా మంచి థియేట్రికల్ అనుభూతిని కలిగిస్తుంది.
రేటింగ్ : 3 /5