Upendra విచిత్రమైన ఆలోచనలతో సినిమాలు చేసి ఆడియన్స్ కి సరికొత్త థియేట్రికల్ అనుభూతిని కలిగించే హీరోలలో ఒకడు ‘ఉపేంద్ర’. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుండి ఇతర భాషల్లో కూడా మంచి మార్కెట్ ని సంపాదించిన మొట్టమొదటి కన్నడ నటుడు ఈయన. అప్పట్లో మన తెలుగు ఆడియన్స్ ఈయన సినిమాలకు ఎగబడేవారు. రెండు మూడు చిత్రాలు కూడా కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పటికీ కూడా ఉపేంద్ర అంటే తెలుగు ఆడియన్స్ కి ఎందుకో ప్రత్యేకమైన క్రేజ్.
అయితే చాలా కాలం తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తూ చేసిన చిత్రం ‘యూఐ’. ఉపేంద్ర మార్క్ సినిమాలను మిస్ అయ్యి ఆయన ఫ్యాన్స్ చాలా కాలం అయ్యింది. టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా వింటేజ్ ఉపేంద్ర మార్క్ అంటే చాలా ఇష్టం. అలాంటి అభిమానులకోసం, ప్రేక్షకుల కోసమే ఆయన ‘యూఐ’ అనే చిత్రం చేసాడు. టీజర్ కూడా విన్నూతన రీతిలో విడుదల చెయ్యగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే ‘యూఐ’ చిత్రం నుండి రీసెంట్ గా ‘చీప్..చీప్’ అనే పాటకి సంబంధించిన ప్రోమో ని విడుదల చేసారు. ఈ ప్రోమో కి సోషల్ మీడియా లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ‘నాది చాలా పెద్దది..నీది చాలా చిన్నది..చీప్..చీప్’ అంటూ సాగే ఈ పాట ని వింటే మనకి ఎలాంటి ఆలోచనలు వస్తాయో మీ అందరికీ తెలిసే ఉంటుంది.
డబుల్ మీనింగ్ వచ్చేలా ఉన్న ఇలాంటి పాటలకే ఈమధ్య కాలంలో యూత్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. నిన్న విడుదలైన ఈ పాటకి యూట్యూబ్ లో తెలుగు వెర్షన్ వరకు 17 లక్షల వ్యూస్ వచ్చాయి. కన్నడ వెర్షన్ కి 19 లక్షల వ్యూస్ వచ్చాయి. దాదాపుగా మాతృక వెర్షన్ కి దగ్గరగా ఈ పాట తెలుగు వెర్షన్ కి వచ్చింది అంటే జనాల్లోకి ఏ రేంజ్ లో ఈ పాట దూసుకెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు.