Akkineni Naga Chaitanya : వాలెంటైన్స్ డే రోజు తన కొత్త ప్రేయసి ని అభిమానులకు పరిచయం చేసిన నాగచైతన్య!

- Advertisement -

Akkineni Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య కి గత కొంతకాలం నుండి బాక్స్ ఆఫీస్ వద్ద సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేని సంగతి తెలిసిందే. ‘లవ్ స్టోరీ’ తర్వాత ఆయన చేసిన సినిమాలలో ‘బంగార్రాజు’ ఒక్కటే పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది. ఆ తర్వాత వచ్చిన ‘థాంక్యూ’, ‘కస్టడీ’ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. కానీ రీసెంట్ గా ఆయన అమెజాన్ ప్రైమ్ కోసం చేసిన ‘దూత’ అనే వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Akkineni Naga Chaitanya
Akkineni Naga Chaitanya

ప్రస్తుతం ఆయన చందు మొండేటి తో ‘తండేల్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల అవ్వగా దానికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగ చైతన్య కెరీర్ లో డిఫరెంట్ సినిమా, కచ్చితంగా ఇది ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాస్తుంది అనే నమ్మకం తో ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్.

ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. లవ్ స్టోరీ తర్వాత ఇది ఆమెకి నాగచైతన్య తో రెండవ సినిమా. అయితే నాగ చైతన్య వాలెంటైన్స్ డే సందర్భంగా తన ప్రేయసి ని పరిచయం చేసాడు. ఏంటి సమంత తో విడాకులు జరిగిన తర్వాత నాగ చైతన్య నిజంగానే వేరే అమ్మాయితో ప్రేమలో పడిన వార్త నిజమేనా అనే సందేహం మీ అందరిలో రావొచ్చు.

- Advertisement -

కానీ నిజమైన ప్రేయసి మాత్రం కాదు,సినిమాలో ఉన్న ప్రేయసినే. తండేల్ చిత్రం లో సాయి పల్లవి తో కలిసి లవర్స్ డే స్పెషల్ గా ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో అప్లోడ్ చేసారు. ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. అయితే ప్రేమికుల రోజే నాగ చైతన్య ఈ వీడియో షేర్ చేసాడంటే, కచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఎదో ఉంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here