Kalki : ఆ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ రిపీట్.. కల్కి సినిమాతో బాక్సాఫీసు రికార్డులు బద్దలవ్వాల్సిందే

- Advertisement -


Kalki : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారారు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా తర్వాత ఆయన చేసిన ప్రతీ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజైన సంగతి తెలిసిందే. వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ప్రభాస్.. ప్రస్తుతం కల్కి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు భారీ తారాగణమే నటిస్తోంది. మహానటి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ డైరెక్టర్ నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమాకు వైజయంతి మూవీ సక్సెస్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలా విడుదల తేదీని ప్లాన్ చేశారు.

కాగా, ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ మూవీ సెంటిమెంట్ క‌ల్కి సినిమాకు రిపీట్ అవుతుందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఆ మూవీ ఏంటి.. ఏం సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో చూద్దాం. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాకు బాహుబలి 2 బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ రిపీట్ కాబోతుందని తెలుస్తోంది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ జాతకం మారిపోయిన విషయం తెలిసిందే. మొదటి పార్ట్ తో టీజర్ చూపించిన రెబల్ స్టార్.. పార్ట్ 2 తో బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కలెక్షన్ల సునామీ సృష్టించాడు. అయితే ఆ తరువాత ప్రభాస్ కు మళ్లీ ఆ రేంజ్ హిట్ పడలేదు. అయితే కల్కి సినిమాతో మరోసారి ఆ రేంజ్ హిట్ పడబోతున్నట్లు తెలుస్తోంది.

నాగ్‌ అశ్విని తెరకెక్కిస్తున్న ఈ కల్కి కూడా రెండు భాగాలుగా రాబోతుందట. మొదటి పార్ట్ టీజర్ లుక్ లాగా రిలీజ్ చేసి.. సెకండ్ పార్టులో మొత్తం రివీల్‌ చేస్తారని సమాచారం. మే 9న రిలీజ్ కాబోతున్న మొదటి భాగం, రెండో భాగం షూటింగ్ కూడా ఒకేసారి నాగ్‌ అశ్విని కంప్లీట్ చేసేస్తున్నాడట. దీని రిలీజ్ డేట్ పై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. కల్కి 2898ADకి బాహుబలి కి మధ్య కొన్ని సిమిలారిటీలు కూడా ఉన్నాయని అందుకే ఈ సినిమా ఖచ్చితంగా మరోసారి బాక్సాఫీసు రికార్డులను బద్దలు చేస్తుందంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే 2017 ఏప్రిల్ 28న బాహుబలి 2 రిలీజ్ అయింది. ఆ ఇయర్ సమ్మర్ మొత్తానికి ప్రభాస్ ఒక్కడే కింగ్.

- Advertisement -

బాహుబలి 2 సినిమా తర్వాత వచ్చిన 2017 జూన్ 23న అల్లు అర్జున్ డీజే విడుదలైనా.. ఆ నెలన్నర కూడా బాహుబలికి ఎటువంటి పోటీ ఇవ్వలేదు. చూస్తుంటే 2024 లోను మళ్లీ ఇదే సీన్ రిపీట్ అయ్యేలా అనిపిస్తుంది. ఇక ఆల్రెడీ వైజయంతి మూవీస్ లక్కీ సెంటిమెంట్.. జగదేకవీరుడు అతిలోకసుందరి, మహానటి రిలీజై బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న మే 9నే కల్కి కూడా రిలీజ్ కాబోతోంది. అయితే నాని, విజయ్ దేవరకొండ ఇలాంటి స్టార్ హీరో సమ్మర్ లో వస్తున్న కల్కి రేంజ్ లో అయితే ఆ సినిమాలకు హైప్‌ ఉండదు. దీంతో ప్రభాస్ మరోసారి బాక్సాఫీసు రికార్డులు చెరిపేయడం ఖాయమంటూ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here