Keerthy Suresh : ప్రస్తుతం ఉన్న ఈ సమాజం లో అమ్మాయిలు చాలా బలంగా, దృడంగా ఉండాలి..అమ్మాయిలను చూస్తే వాళ్ళని ఏడిపించాలి అనే ఆలోచన ఉన్న మగవాళ్లకు వణుకు పుట్టాలి. ఏమి చేస్తే ఏమి జరుగుతుందో అని భయపడాల్సిన అవసరం లేదు అని పెద్దలు అంటూ ఉంటారు. అలాంటి మాటల ప్రభావం ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ మీద చాలా బలంగా ప్రభావితం చేశాయో ఏమో తెలియదు కానీ, ఆమె మాత్రం పెద్దలు చెప్పిన ఆ సూత్రాలను చాలా బలంగా అనుసరించింది.

తన వైపు నుండి ఎలాంటి తప్పు పెట్టుకోకుండా, తన జోలికి వస్తే మాత్రం ఇచ్చి పడేసే గుణం ఉన్న అమ్మాయి ఆమె. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తానూ సినిమాలలోకి రాకముందు చదువుకునే రోజుల్లో జరిగిన ఒక సంఘటన ని గుర్తు చేసుకుంటూ ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఆమె మాట్లాడుతూ ‘నేను చదువుకునే రోజుల్లో మా కాలేజీ ఆవరణలో కొంతమంది అబ్బాయిలు తాగేసి వచ్చి అమ్మాయిలను కామెంట్ చేస్తూ ఉండేవారు. అలా నా మీద కూడా ఒకడు కామెంట్ చేసాడు. నన్ను ఎప్పుడు గెలుకుతాడా, ఎప్పుడు ఇచ్చి పారేద్దామా అని అనుకుంటున్న సమయం లో సరిగ్గా అతను గెలికాడు. అంటే చెప్పు తీసుకొని రెండు చెంపలు వాయించేసాను’ అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్.

ఆమె మాట్లాడిన ఈ మాటలు విని ‘శభాష్ అమ్మాయిలు ఈ కాలం లో ఇలాగే ఉండాలి’ అంటూ కామెంట్స్ చేసాడు. ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే గత ఏడాది ఈమె తెలుగు లో ‘దసరా’, ‘భోళా శంకర్’ వంటి చిత్రాలు చేసింది. వీటిలో దసరా పెద్ద హిట్ అవ్వగా, ‘భోళా శంకర్’ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ ఏడాది ఆమె సైరెన్ అనే తమిళ సినిమాతో మన ముందుకు రావోతుంది. జయం రవి హీరో గా నటించిన ఈ సినిమా సినిమాలో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ చేస్తుంది.