Eagle Movie Review : ‘ఈగల్’ మూవీ ఫుల్ రివ్యూ..చివరి 40 నిమిషాలు ‘విక్రమ్’ నే మించిపోయింది!!

- Advertisement -

నటీనటులు : రవితేజ  అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, మధుబాల, అవసరాల శ్రీనివాస్ తదితరులు.

సినిమాటోగ్రఫీ : కార్తీక్ ఘట్టమనేని
దర్శకత్వం : కార్తీక్ ఘట్టమనేని
సంగీతం : దేవ్జంద్
నిర్మాత : టీజీ విశ్వప్రసాద్
బ్యానర్ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ

Eagle Movie Review మాస్ మహారాజ రవితేజ ఇటీవల కాలం లో వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ లాంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన రవితేజ కి, ఆ తర్వాత వచ్చిన ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. అలాంటి సమయం లో ‘ఈగల్’ చిత్రం ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది. కారణం ఈ సినిమా కి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం హై క్వాలిటీ తో ఉండడమే. రవితేజ పాత్ర కూడా చూసేందుకు చాలా కొత్తగా అనిపించింది. అందుకే ఈ సినిమాకి గతం లో రవితేజ సినిమాలకు ఎన్నడూ లేని విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. అలా భారీ అంచనాల నడుమ నేడు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ రివ్యూ లో చూద్దాం.

- Advertisement -

కథ :

ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ నళిని (అనుపమ పరమేశ్వరన్) తలకోన అడవుల్లో ఉత్పత్తయ్యే పత్తి గురించి ఒక చిన్న వార్త రాస్తుంది. ఆ చిన్న వార్త పెను దుమారం రేపుతోంది. ఏకంగా నేషనల్ ఇంటెలిజెన్స్ బ్యూరో రంగంలోకి దిగి నళిని ని కొన్ని గంటలపాటు విచారిస్తుంది. అసలు తలకోనలో పత్తి ఉత్పత్తి గురించి రాస్తే ఇంటెలిజెన్స్ బ్యూరో ఎందుకు రంగం లోకి దిగింది అనే యాంగిల్ నుండి నళిని ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. అప్పుడు ఆ పత్తి పరిశ్రమని నడుపుతున్న సహదేవ్(రవితేజ) గురించి తెలుస్తుంది. అసలు ఈ సహదేవ్ ఎవరు?, అతని కోసం ఇంతమంది ఎందుకు వెతుకుతున్నారు?, మార్గశిర మధ్యరాత్రి అసలు ఏమి జరిగింది అనే విషయాలను తెలుసుకునేందుకు నళిని ప్రయాణం చేసే కథనే ఈ సినిమా.

విశ్లేషణ :

డైరెక్టర్ కార్తీక్ ఘట్టమేని చాలా ఆసక్తికరమైన పాయింట్ తో ఈ సినిమా స్టోరీ లైన్ ని సిద్ధం చేసాడు. అంతే ఆసక్తికరంగా స్క్రీన్ ప్లే ని కూడా నడిపించాడు. ఆడియన్స్ లో అసలు ఈ సహదేవ్ ఎవరు, అతను చేసిన విద్వంసం ఏమిటి అనేది తెలుసుకునేందుకు చాలా ఆసక్తి చూపించేలా ఫస్ట్ హాఫ్ మొత్తం సాగింది. కొన్ని కొన్ని యాక్షన్ బ్లాక్స్ ఫస్ట్ హాఫ్ లో అదిరిపోయాయి కానీ ఓవరాల్ గా యావరేజి ఫస్ట్ హాఫ్ అని అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం మీద రవితేజ కనిపించేది కేవలం 30 నిమిషాలు మాత్రమే. డైలాగ్స్ కూడా రవితేజ కి చాలా తక్కువ ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ కి మించి అద్భుతంగా ఉంది. ప్రతీ సన్నివేశం ని డైరెక్టర్ రాసుకున్న తీరు చాలా బాగుంది. రవితేజ ని చాలా కొత్తగా చూపించడం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు మాత్రం ఫ్యాన్స్ కి అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని ఇస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే రవితేజ ఈ సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. రవితేజ తక్కువ మాట్లాడుతూ ఎక్కువ యాక్షన్ చెయ్యడం చాలా తక్కువసార్లు మనం చూసి ఉంటాం. ఎల్లప్పుడూ బీభత్సమైన ఎనర్జీ తో ఉండే రవితేజ ని అలాంటి పాత్రల్లో మనం చూడలేము . కానీ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని రవితేజ ని అలాంటి పాత్రలో చూపించి కూడా జనాలను మెప్పించాడు. ఇక అనుపమ పరమేశ్వరన్ కి చాలా కాలం తర్వాత మంచి పాత్ర పడింది అనే చెప్పాలి. నవదీప్, కావ్య థాపర్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల వంటి నటీనటులు తమ పాత్రలకు తగ్గట్టుగా న్యాయం చెయ్యడం లో సఫలం అయ్యారు. దవ్జాండ్ గుర్తు పెట్టుకునే రేంజ్ పాటలు అయితే ఇవ్వలేదు కానీ, సందర్భానికి తగ్గట్టుగా అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అందించాడు. ఇక సినిమాటోగ్రాఫర్ గా, డైరెక్టర్ గా ద్విపాత్రాభినయం చేసిన కార్తీక్ ఘట్టమనేని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా తర్వాత ఆయన వేరే లెవెల్ కి వెళ్ళిపోతాడు అనడం లో ఎలాంటి అతిసయోక్తి లేదు.

చివరిమాట:

రవితేజ నుండి చాలా కాలం తర్వాత వచ్చిన బలమైన కంటెంట్ ఉన్న సినిమా. సంక్రాంతి సినిమా తర్వాత మన టాలీవుడ్ లో సినిమాలు కరువు అయ్యాయి. ఇలాంటి సమయం లో ‘ఈగల్’ చిత్రం మూవీ లవర్స్ కి కనుల పండుగని అందిస్తుంది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.

రేటింగ్ : 3 /5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here