Virat Kohli : సోషల్ మీడియా లో బాగా పాపులర్ అయినా ‘కుర్చీ మడతపెట్టి’ డైలాగ్ ని వాడుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ‘గుంటూరు కారం’ చిత్రం లో థమన్ తో ఒక పాట చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ పాటకి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మహేష్ బాబు, శ్రీలీల వేసిన మాస్ డ్యాన్స్ స్టెప్స్ కి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి.

విడుదలకు ముందే 70 మిలియన్ కి పైగా వ్యూస్ ని యూట్యూబ్ లో దక్కించుకున్న ఈ పాట, సోషల్ మీడియా మొత్తం ఒక ఊపు ఊపేసింది. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఈ పాట మీద వచ్చినన్ని రీల్స్ సౌత్ ఇండియా లో ఈమధ్య కాలం లో ఏ సినిమాకి కూడా రాలేదు. అలాగే యూట్యూబ్ లో కూడా షార్ట్ వీడియోస్ రూపం లో ఇప్పటికీ నెటిజెన్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నారు.

ఇక టీవీ షోస్ లో అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎంటర్టైన్మెంట్ షోస్ లో విచ్చలవిడిగా ఈ పాటని వాడేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో ట్రెండ్ కి తగ్గట్టు అప్పుడప్పుడు రీల్స్ చేసే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ రీసెంట్ గా ఈ ‘కుర్చీ మడతపెట్టి’ పాట కి డ్యాన్స్ స్టెప్పులు వేసినట్టు ఒక అభిమాని ఎడిట్ చేసి పెట్టాడు. అది ఇప్పుడు సోషల్ మీడియా లో విపరీతంగా ట్రెండ్ అయిపోయింది.

గతం లో వీళ్లిద్దరు కలిసి ఒక పాటకి డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ రీల్ చేసారు. ఈ రీల్ లోని స్టెప్పులు చూస్తుంటే కుర్చీ మడతపెట్టి సాంగ్ స్టెప్పులకు చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఆ స్టెప్పులకు తగ్గట్టుగా ‘కుర్చీ మడతపెట్టి’ ఆడియో ని జత చెయ్యగా, నిజంగానే వీళ్ళు డ్యాన్స్ చేసారా అనే రేంజ్ సింక్ కుదిరింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.
