Chiranjeevi మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్ మెగాస్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఆయన కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాల్లో నటించి.. నటనా రంగంలోకి రావాలనుకునే వారికి ఇన్సిపిరేషన్ గా మారారు. ఇటు సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంలో ఎంతో మందికి సాయం చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న మెగాస్టార్ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలుసు.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదల వెంకటరావు, అంజనాదేవి దంపతులకు మొదటి సంతానంగా చిరంజీవి జన్మించారు. చదువు పూర్తయ్యాక సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ కెరీర్ ప్రారంభించాడు. ఎన్నో కష్టాలు, అవమానాలు తట్టుకుని స్వయం కృషితో మెగాస్టార్ గా పాపులర్ అయ్యాడు. ఇక చిరంజీవి అండతో చాలా మంది మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి హీరోలుగా సక్సెస్ అయ్యారు. నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయి ధరంతేజ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ టాలీవుడ్ లో మెగా సామ్రాజ్యాన్నే సృష్టించారు. అయితే మెగా నటులంటే అందరికీ తెలుసు. కానీ చిరు తండ్రి కొణిదల వెంకటరావు కూడా ఓ సినిమాలో నటించారు.
అదే సినిమాలో మెగాస్టార్ కూడా నటించారు. చిరు తండ్రి కేవలం పోలీస్ కానిస్టేబుల్ అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ బాపు దర్శకత్వంలో మంత్రిగారి వియ్యంకుడు సినిమాలో నటించాడు. ఈ సినిమాలో చిరంజీవి – పూర్ణిమ భాగ్యరాజ్ కనిపించారు. అల్లు రామలింగయ్య ప్రధాన పాత్ర పోషించారు. ఇందులో మంత్రి పాత్రకు సరిపోయే నటుడి కోసం దర్శకుడు చాలా మందిని సంప్రదించగా.. ఎవరు సెట్ అవ్వలేదు. చివరకు రామలింగయ్య చిరంజీవి తండ్రి ఉన్నాడు, ఒకసారి స్క్రీన్ టెస్ట్ చేద్దాం అని మేకర్స్ స్క్రీన్ టెస్ట్ చేశారు. ఆ విధంగా మంత్రి పాత్రకు చిరు తండ్రి వెంకటరావు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారని తెలిసింది. చిరంజీవి, వెంకట్రావుల మధ్య ఎలాంటి సన్నివేశాలు లేకపోయినా.. చిరు తన తండ్రితో కలిసి నటించిన సినిమా ఇదే. 1983లో విడుదలైన ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది.