Actor Naresh : ఈ వయస్సు లో రజినీకాంత్ అలాంటి పనులు చెయ్యడం అవసరమా? : నరేష్

- Advertisement -

Actor Naresh : ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో సీనియర్ నటుడు నరేష్ ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యాడో మనమంతా చూసాము. పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకోవడం. ఆ తర్వాత ఆయన మూడవ భార్య రమ్య కోర్టులో కేసు వేసి గొడవలు చెయ్యడం వంటివి పెద్ద దుమారమే రేపింది. ఈ సంఘటనకి ముందు నరేష్ కెరీర్ వేరే లెవెల్ లో ఉండేది. ప్రతీ శుక్రవారం విడుదలయ్యే సినిమాలో ఆయన కచ్చితంగా ఒక ముఖ్యపాత్రలో కనిపించేవాడు.

Actor Naresh
Actor Naresh

కానీ ఈ సంఘటన తర్వాత నరేష్ కి అవకాశాలు తగ్గాయి. ఆయనే ఇక చాలులే లిమిట్ గా సినిమాలు చేసుకుందాం అని అనుకున్నాడో, లేకపోతే నిర్మాతలు ఆమ్మో ఈయనతో ఎందుకులే , చుట్టూ వివాదాలు ఉంటాయి అని దర్శక నిర్మాతలు రావట్లేదో తెలియదు కానీ. ఈమధ్య కాలం లో ఆయన తక్కువ సినిమాల్లోనే కనిపిస్తున్నాడు. అయితే చాలా కాలం తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చాడు.

ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఆయన ఇచ్చిన రీసెంట్ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఇంటర్వ్యూ లో ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి మాట్లాడుతూ ‘రజినీకాంత్ గారికి 70 ఏళ్ళు దాటాయి. ఇంకా ఆయన సూపర్ స్టార్ డమ్ తోనే కొనసాగుతున్నాడు. అది ఏ స్థాయి స్టార్ డమ్ అంటే ఏకంగా 700 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టేంత స్టార్ డమ్.

- Advertisement -

ఆ వసూళ్లను నేటి తరం హీరోలు కూడా అందుకోలేకపోయారు. ఇది చూసి నిజంగా నేను ఆశ్చర్యానికి గురి అయ్యాను. రజినీకాంత్ గారికి ఈ వయస్సులో డ్యాన్స్ వెయ్యడం, ఫైట్స్ చెయ్యడం అసలు అవసరమే లేదు. కానీ ఆయనకీ అభిమానులు ఇస్తున్న ఉత్సాహం వల్ల ఇప్పటికీ కష్టపడుతున్నాడు. ఆయనే నాకు ఆదర్శం,నేను కూడా నా చివరి శ్వాస వరకు సినిమాల్లోనే కొనసాగుతాను’ అంటూ చెప్పుకొచ్చాడు నరేష్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here