Director Maruthi సలార్‌తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయిన ప్రభాస్… నెక్స్ట్ కల్కి 2898 ఏడితో రాబోతున్నాడు. మే 9న కల్కి భారీ ఎత్తున రిలీజ్ కానుంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత రాజా సాబ్‌గా రాబోతున్నాడు డార్లింగ్. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టైటిల్‌ను ఇటీవలె సంక్రాంతికి అనౌన్స్ చేశారు. ఇప్పటికే సైలెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రాజా సాబ్‌ను ఈ ఏడాదిలోనే రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు అనే మాట గత కొన్ని రోజులుగా వినిపిస్తోంది.
కల్కి రిలీజ్ అయిన తర్వాత రాజా సాబ్ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని అంతా అనుకున్నారు. ఇటీవల మారుతి మాట్లాడుతూ…ప్రభాస్ నుంచి ముందుగా ఓ పెద్ద సినిమా రానుంది, కాబట్టి దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలని అన్నారు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఇయర్ ఎండింగ్లో రాజా సాబ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మారుతి తను ఒక వ్యక్తికి ట్రూ లవర్ ని అని చెప్పాడు. అతనెవరంటే..
‘నేను ప్రభాస్‌కు ట్రూ లవర్ని. ప్రస్తుతం ఆయన ప్రేమని ఎంజాయ్ చేస్తున్నాను. ఆయనంటే నాకెంత ఇష్టమో ‘రాజా సాబ్’లో చూస్తారు. ఇది చాలా సింపుల్ లాజిక్’ అన్నారు. ఇటీవల మరో ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమా విడుదల తేదీపై స్పందిస్తూ.. ‘త్వరలోనే ప్రభాస్ నటించిన పెద్ద సినిమా విడుదల కానుంది. దాని అప్డేట్స్ రావాలి. ఆ చిత్రం మంచి విజయం సాధించాలి. దాని తర్వాత ‘రాజాసాబ్’ అప్డేట్స్ వస్తాయి. అందరూ కోరుకునే మంచి తేదీకే దీన్ని రిలీజ్ చేస్తాం’ అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ప్రభాస్ అభిమానులు షేర్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఇది విడుదలయ్యే అవకాశముందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి