Rashmika Mandanna : అతడి వల్లే ఇలా ఉన్నా..విజయ్ దేవరకొండపై ప్రేమను బయటపెట్టిన రష్మిక..

- Advertisement -

Rashmika Mandanna : టాలీవుడ్ లవ్ బర్డ్స్ గా అందరూ భావిస్తున్న రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ.. తమ మధ్య ఏముందో ఇప్పటి వరకూ చెప్పలేదు. అయితే అందరూ అనుకుంటున్నట్లు ఏదో ఉందని మాత్రం తరచూ తమ మాటలు, చేతల ద్వారా పరోక్షంగా చెబుతూనే ఉంటారు. తాజాగా రష్మిక మరోసారి విజయ్ పై చేసిన కామెంట్స్ అలాగే ఉన్నాయి.

విజయ్ తనకు సపోర్ట్ చేసినట్లు ఎవరూ చేయలేదని, తాను చేసే ప్రతి పనిలో అతని భాగస్వామ్యం ఉంటుందని చెప్పడం విశేషం. ప్రస్తుతం యానిమల్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఇందులో తన కోస్టార్ట్స్ అమితాబ్, సిద్ధార్థ్ మల్హోత్రా, రణ్‌బీర్ కపూర్, అల్లు అర్జున్ ల గురించి కూడా మాట్లాడింది. అయితే విజయ్ దేవరకొండపై ఆమె చేసిన కామెంట్స్ మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. తమ మధ్య అందరూ అనుకుంటున్నట్లు ఏదో ఉందన్నట్లుగా ఆమె మాటలు ఉన్నాయి.

Rashmika - Vijay Deverakonda
Rashmika – Vijay Deverakonda

“విజు, నేను ఇద్దరం కలిసే ఈ స్థాయికి వచ్చాం. అందుకే ప్రస్తుతం నా జీవితంలో నేను ఏం చేసినా అందులో అతని భాగస్వామ్యం ఉంటుంది. నేను చేసే ప్రతి పనికీ అతని సలహా తీసుకుంటాను. నాకు అతని అభిప్రాయం అవసరం. ప్రతిదానికీ ఎస్ అని చెప్పే వ్యక్తి కాదతడు. కచ్చితమైన అభిప్రాయం ఉంటుంది. ఇది మంచిది.. ఇది కాదు.. నేను ఇలా అనుకుంటున్నాను.. ఇది అనుకోవడం లేదు. నా మొత్తం జీవితంలో విజయ్ నాకు సపోర్ట్ ఇచ్చినట్లుగా ఎవరూ చేయలేదు. అందుకే అతన్ని నేను చాలా చాలా గౌరవిస్తాను” అని రష్మిక చెప్పింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here