Actress : ప్రస్తుతం సోషల్ మీడియా కి నెటిజెన్స్ ఏ రేంజ్ లో అలవాటు పడ్డారో మన అందరం చూస్తూనే ఉన్నాం. రోజుకి తమ వ్యక్తిగత జీవితాల్లో నెటిజెన్స్ ఎన్ని గంటలు ఉద్యోగం చేస్తారో తెలియదు కానీ, సోషల్ మీడియా లో మాత్రం కనీసం 8 గంటలు ఉంటున్నారు. సోషల్ మీడియా అనేది వాళ్లకు ఒక వ్యసనం లాగా మారిపోయింది. ఎప్పుడైతే ‘టిక్ టాక్’ వచ్చిందో, అప్పటి నుండి నెటిజెన్స్ ఇంకా పిచ్చి పెరిగిపోయింది.
కరోనా తర్వాత ఇండియన్ ప్రభుత్వం టిక్ టాక్ ని బ్యాన్ చెయ్యడం తో, అందరూ ఇప్పుడు ఇంస్టాగ్రామ్ రీల్స్ మీద పడ్డారు. సమయం దొరికితే చాలు ప్రపంచాన్ని మర్చిపోయి ఇంస్టాగ్రామ్ రీల్స్ చేసేస్తున్నారు. అవి సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారిపోతున్నాయి. ఇంస్టాగ్రామ్ లో ఒక రీల్ కి భారీ రేంజ్ లో వ్యూస్ వస్తే ఇంస్టాగ్రామ్ సంస్థ డబ్బులు ఇస్తుంది.
దీంతో నెటిజెన్స్ ఇంకా రెచ్చిపోతున్నారు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఒక స్త్రీ తన బిడ్డ ని పక్కన పారేసి ఇంస్టాగ్రామ్ రీల్ మీద ద్రుష్టి పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఒక మెట్రో రైల్వే స్టేషన్ లో సాధారణంగా నడుచుకుంటూ వస్తున్న ఒక మహిళ, అకస్మాత్తుగా తన బిడ్డని పక్కన పెట్టేసి డ్యాన్స్ వేస్తూ రీల్ చేసింది. పాపం ఆ బిడ్డ క్రింద పడిపోయినా కూడా ఆమె పట్టించుకోలేదు.
రీల్స్ వ్యామోహం లో పడిపోయి బిడ్డని నిర్లక్ష్యం చేస్తారా?, అసలు మీకు బుర్ర ఉందా అని ఆ స్త్రీ ని నెటిజెన్స్ బండ బూతులు తిడుతున్నారు. ఈమె ఆహా మీడియా లో పలు వెబ్ సిరీస్ లలో చిన్న చిన్న పాత్రలు కూడా చేసిందట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
बच्चा गिर जाए, चोटिल हो जाए, प्लेटफार्म से नीचे चला जाए रील बननी चाहिए. यहीं लड़का बड़ा होकर कहेगा – तू नारी नहीं पिशाचिनी है पिशाचिनी। पति जी तो मेरी तरह लग रहे 🙄🙄 pic.twitter.com/kOH3v3HvH8
— लंकेश (@Observer4s) January 28, 2024