Hanuman Movie : సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తారీఖున విడుదలైన ‘హనుమాన్ ‘ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ ఈ సినిమాకి ప్రతీ రోజు కోటి రూపాయలకు తక్కువ కాకుండా షేర్ వసూళ్లు వస్తున్నాయి. #RRR లాంటి సినిమాకి కూడా 17 తర్వాత వసూళ్లు తగ్గాయి. కానీ హనుమాన్ చిత్రానికి మాత్రం వసూళ్ల సునామి జోరు అసలు ఏమాత్రం తగ్గడం లేదు.

మధ్యలో వీకెండ్స్ వచ్చింది అంటే మొదటి రోజు వచ్చిన వసూళ్లకు డబుల్ వసూళ్లు వస్తున్నాయి. మరోపక్క హిందీ లో కూడా ఈ చిత్రానికి 50 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు దాటాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇప్పుడు సంక్రాంతి చరిత్ర లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిందని అంటున్నారు. గతం లో ‘అలా వైకుంఠపురంలో’ సినిమా రికార్డు చాలా కాలం వరకు పదిలంగా ఉంటూ వచ్చింది.

ఆ రికార్డుని ‘హనుమాన్‘ ఇప్పుడు అధిగమించినట్టు తెలుస్తుంది. అయితే థియేట్రికల్ రన్ ఇంకా ఉండే పరిస్థితి ఉండడం తో ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని వాయిదా వేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత 28 రోజులకు ఓటీటీ లో విడుదల అవ్వాలి. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని జీ 5 సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది.

కానీ ఇప్పుడు థియేట్రికల్ రన్ మరో రెండు వారాలు ఉండే అవకాశం ఉండడం తో స్ట్రీమింగ్ డేట్ వాయిదా వెయ్యమని జీ 5 వారిని రిక్వెస్ట్ చేస్తుందట మూవీ టీం. కానీ జీ 5 వారు అందుకు సుముఖంగా లేరని తెలుస్తుంది. పెద్ద పెద్ద స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలే ఒప్పందం ప్రకారం వచ్చేస్తున్నాయి, మీకు అంత బిల్డప్ అవసరమా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.