Ram Chanran : రామ్ చరణ్ కోసం ఎదురు చూడడమే నేను చేసిన మహా పాపం : ప్రశాంత్ వర్మ

- Advertisement -

Ram Chanran : ప్రస్తుతం ఇండియా మొత్తం ప్రశాంత్ వర్మ పేరు ఏ రేంజ్ లో మారు మోగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ‘హనుమాన్ ‘ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద ఆయా సరీష్టించిన ప్రభంజనం అలాంటిది మరి. చిన్న సినిమాగా విడుదలై, ఎన్నో రాజకీయాలను ఎదురుకొని, అతి తక్కువ థియేటర్స్ తో జనవరి 12 వ తేదీన విడుదలైన ఈ సినిమా సాధారణ టికెట్ రేట్స్ తోనే 250 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్, 140 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది.

కొన్ని ప్రాంతాలలో అయితే స్టార్ హీరోలకు ఇప్పటి వరకు సాధ్యం కానీ రికార్డ్స్ ని నెలకొల్పి చరిత్ర సృష్టించింది. ఇప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న ఈ సినిమా, అతి త్వరలోనే నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్ గా నిలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈయన ఒక ఇంటర్వ్యూ లో ‘రామ్ చరణ్ , అల్లు అర్జున్ డేట్స్ ఇస్తారని చాలా కాలం ఎదురు చూసి తప్పు చేశాను, మోసపోయాను, అందుకే కసితో ఈ హనుమాన్ చిత్రం చేశాను’ అని కామెంట్స్ చేసినట్టు సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరిగింది. దీనిపై రామ్ చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రశాంత్ వర్మ ని సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రోల్ చేసారు.

- Advertisement -

వెంటనే స్పందించిన ప్రశాంత్ వర్మ ‘నేను రామ్ చరణ్ , అల్లు అర్జున్ కోసం ఎదురు చూసి తప్పు చేశా అంటూ సోషల్ మీడియా లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. వాళ్లిద్దరూ నాకు ఎంతో అభిమానమైన హీరోలు. వాళ్ళతో సినిమా చేసే అవకాశం వస్తే అదృష్టం గా భావిస్తాను, మంచి కథ దొరికితే కచ్చితంగా సినిమా చేస్తాను, సోషల్ మీడియా లో వచ్చే పిచ్చి పిచ్చి రూమర్స్ ని నమ్మకండి’ అంటూ ప్రశాంత్ వర్మ ఈ సందర్భంగా రెస్పాన్స్ ఇచ్చాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here