Nagachaitanya – Anushka Shetty : టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఇప్పటి వరకు పెళ్లి కానీ వాళ్ళ లిస్ట్ తీస్తే అందులో అనుష్క మొదటి స్థానం లో ఉంటుంది. ఈమెతో పాటు ఇండస్ట్రీ లోకి వచ్చిన స్టార్ హీరోయిన్స్ అందరూ ఇటీవల కాలం లో ఒకరి తర్వాత ఒకరు పెళ్లి చేసుకుంటూ వెళ్లారు. కానీ అనుష్క మాత్రం నాలుగు పదుల వయస్సు దాటినా కూడా ఇంకా పెళ్లి ప్రస్తావన తీసుకొని రావడం లేదు.
నిన్నమొన్నటి వరకు ప్రభాస్ తో ప్రేమాయణం అన్నారు. ఆ తర్వాత అది కేవలం రూమర్ మాత్రమే, అనుష్క ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం ని చేసుకుంటుంది. పెళ్లి కొడుకు బెంగళూరు కి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త అని ప్రచారం చేసారు. కానీ ఇప్పటి వరకు పెళ్ళికి సంబంధించిన ఊసు లేదు. ఇప్పుడు రీసెంట్ గా ఒక ప్రముఖ స్టార్ క్రికెటర్ తో ప్రేమాయణం అని రూమర్ వినిపిస్తుంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో కూడా తెలియదు.
ఇదంతా పక్కన పెడితే అనుష్క కి సంబంధించి అప్పట్లో పలువురు హీరోల తో అఫైర్స్ ఉన్నట్టు వార్తలు వినిపించేవి. వారిలో నాగ చైతన్య ఒకడు. అనుష్క సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్ గా పని చేసేది. పలువురు సెలబ్రిటీస్ కొడుకులకు కూడా ఆమె యోగా క్లాసులు చెప్పేది. అలా అప్పట్లో నాగ చైతన్య కి కూడా ఇంటికి వచ్చి యోగా క్లాసులు చెప్పేడట. ఆ సమయం లోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం నడిచిందని, ఈ విషయం తెలుసుకున్న నాగార్జున అప్పట్లో నాగ చైతన్య మీద ఫైర్ అయ్యినట్టు వార్తలు వినిపించేవి. కానీ వాటిల్లో ఎలాంటి నిజం లేదని నాగార్జున తెలిపాడు.
అనుష్క కి నాగ చైతన్య కి మధ్య చాలా వయస్సు తేడా ఉంది. నాగ చైతన్య అనుష్క కి తమ్ముడు వరుస అవుతాడు. అలాంటి వాడిపై ఇలాంటి రూమర్స్ రాయడం మన దురదృష్టకరం అంటూ నాగార్జున కౌంటర్ ఇచ్చాడు. దీనిపై సమంత కూడా అప్పట్లో పలు ఇంటర్వ్యూస్ లో ఖండించింది. సోషల్ మీడియా లో అప్పట్లో పలు పోస్టులు కూడా పెట్టింది.