Priyanka Jain : సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించిన ప్రియాంక జైన్ బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పాల్గొని కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు ఎంత దగ్గరైందో మనమంతా చూసాము. టాస్కులు ఆడే విషయం లో మగవాళ్ళతో సమానంగా పోటీ ని ఇచ్చి సీజన్ మొత్తం మీద టాప్ 5 లోకి అడుగుపెట్టిన ఏకైక లేడీ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది ప్రియాంక జైన్.

అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత చేతినిండా సినిమాలు, సీరియల్స్ తో ఫుల్ బిజీ అయిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె మాత్రం కేవలం తన ‘నెవెర్ ఎండింగ్ టేల్స్’ యూట్యూబ్ ఛానల్ కి పరిమితం అయ్యింది. ఈ ఛానల్ లో ఆమె బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఎన్నో వీడియోస్ చేసింది. కానీ రీసెంట్ గా ఆమె చేసిన వీడియో మాత్రం ఆమె ఫ్యాన్స్ చేత కంటతడి పెట్టించేలా చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రియాంక జైన్ తల్లి కి రీసెంట్ గానే క్యాన్సర్ వచ్చిందట. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లకముందే మా అమ్మ కి పీరియడ్స్ లో రక్తం ఎక్కువగా పోతూ ఉండేదని, ఒక్కోసారి ఆడవాళ్లకు అలాగే అవుతుంటాది కదా, ఏమి కాదులే సర్దుకుంటుంది అని అనుకోని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాను. కానీ నేను హౌస్ లోకి అడుగుపెట్టి, తిరిగి వచ్చేంత వరకు కూడా అమ్మకి అలా పీరియడ్స్ అవుతూనే ఉన్నిందట. దీంతో అనుమానం వచ్చి ఆమెని డాక్టర్ వద్దకు తీసుకెళ్ళాం.

పలు టెస్టులను నిర్వహించిన డాక్టర్లు, అమ్మకి క్యాన్సర్ మొదటి స్టేజిలో ఉందని తెలిపాడు. వెంటనే ఆమెకి లాప్రోస్కోపిక్ ట్రీట్మెంట్ చేయించి యూట్రస్ ని తొలగింపచేసాము. ఇప్పుడు ఆమె పూర్తిగా కోలుకుంది అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక జైన్. నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లకుండా ఉండుంటే, ముందుగానే ఈ విషయం పసిగట్టి అమ్మకి ట్రీట్మెంట్ చేయించేదానిని, ఇంత దూరం సమస్య వచ్చేది కాదు అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చింది.
