Artist Surya : #RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో మొదలైన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటికీ షూటింగ్ పూర్తి కానీ పరిస్థితి ఏర్పడింది. మధ్యలో శంకర్ ‘ఇండియన్ 2 ‘ సినిమాకి పని చెయ్యడం వల్లే ఇదంతా జరిగింది. ఎప్పుడో షూటింగ్ ని పూర్తి చేసి, ఈ ఏడాది సంక్రాంతి కి సినిమాని దింపాలనే ప్లాన్ లో ఉండేవాడు నిర్మాత దిల్ రాజు.
కానీ శంకర్ ఈ సినిమాకి కావాల్సిన డేట్స్ ఇవ్వకుండా దిల్ రాజు కి టార్చర్ చూపిస్తున్నాడట. మరో రెండు మూడు నెలల్లో సినిమా పూర్తి చేసి, ఎట్టి పరిస్థితిలో సెప్టెంబర్ నెలలో ఈ సినిమాని విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడట దిల్ రాజు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో నటించిన సూర్య అనే క్యారెక్టర్ ఆర్టిస్టు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘నేను గేమ్ చేంజర్ సినిమాలో నెగటివ్ రోల్ చేశాను. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లో మా నాన్న చనిపోయాడు. ఈ విషయం షూటింగ్ లో ఎవరికీ తెలియనివ్వకుండానే ఆ రోజు షూటింగ్ పూర్తి చేశాను. ఆ రోజు షాట్ లో రామ్ చరణ్ నన్ను కొడితే క్రింద పడి నేను బౌన్స్ అవ్వాలి.
కానీ ఈ బాధలో నేను పూర్తిగా శ్రద్ద చుపించాలేకపోయాను. సుమారుగా పది టేకులు తీసుకోవాల్సి వచ్చింది నా వల్ల. రామ్ చరణ్ నన్ను కొట్టిన ప్రతీసారి దగ్గరకి వచ్చి క్షమించు బ్రదర్ అనేవాడు. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ కూడా ఇంత సంస్కారం ఇది వరకు నేను ఏ హీరోలో చూడలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు సూర్య. ప్రస్తుతం ఆయన హీరో గా నటించిన ‘రామ్(ర్యాపిడ్ యాక్షన్ మిషన్)’ సినిమా విడుదలకు సిద్ధం గా ఉంది. ఈ సినిమా ప్రొమోషన్స్ లో చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు హీరో సూర్య.