Junior NTR : రాజమౌళి తండ్రి పై ఎన్టీఆర్ ఫైర్..ఇంకెప్పుడు అతన్ని నా ముందుకు తీసుకొని రావొద్దు అంటూ వార్నింగ్!

- Advertisement -

Junior NTR : రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో #RRR చిత్రం గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. #RRR సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ షేడ్స్ తో ఉంటుంది అని, ఆ క్యారక్టర్ కి సపోర్టింగ్ గా ఎన్టీఆర్ పాత్ర ఉంటుంది కదా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై నందమూరి ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ ని సంపాదించుకొని, అశేష ప్రేక్షాధారణ దక్కించుకున్న ఎన్టీఆర్ పై ఇలాంటి కామెంట్స్ చెయ్యడం సబబు కాదంటూ విజయేంద్ర ప్రసాద్ పై విరుచుకుపడ్డారు. 2018 వ సంవత్సరం తర్వాత ఎన్టీఆర్ నుండి సోలో గా ఒక్క సినిమా కూడా విడుదల కాలేదని, మూడేళ్ళ విలువైన సమయం #RRR కి కేటాయించాడని, ప్రైమ్ టైం లో మీ మీద గౌరవం ఉంచి అంత కాలం డేట్స్ ఇస్తే, మీరు ఇలా తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ ఫ్యాన్స్ మండిపడ్డారు.

ఈ విషయం జూనియర్ ఎన్టీఆర్ వరకు రీచ్ అవ్వడం తో ఆయన చాలా అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ వ్యక్తిగత పీఆర్ టీం సోషల్ మీడియా కి చెందిన ప్రముఖ వెబ్ సైట్స్ చేత విజయేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ ని ఖండిస్తూ పోస్టులు వేయించారు. ఆ తర్వాత రాజమౌళి, కార్తికేయ మరియు కీరవాణి వంటి వారిని ట్యాగ్ చేస్తూ ‘సద్యమానినంత వరకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ని మీడియా ముందుకు రాకుండా చూసుకోండి’ అంటూ పోస్టులు వేశారు.

- Advertisement -

గతం లో కూడా విజయేంద్ర ప్రసాద్ #RRR చిత్రం విడుదలకు ముందు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ పాత్రలలో మీకు ఎవరి పాత్ర బాగా నచ్చింది అని ఒక యాంకర్ అడగగా, విజయేంద్ర ప్రసాద్ నాకు రామ్ చరణ్ పాత్ర చాలా నచ్చింది అంటాడు. ఇలా ఆయన పలుసార్లు కామెంట్స్ చెయ్యడం తో ఆయనకీ మెగా ఫ్యామిలీ హీరోల మీద ఉన్నటువంటి అభిప్రాయం, నందమూరి హీరోల మీద లేదని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here